Nithya menon
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేమింతే ఉంటా అనేటువంటి హీరోయిన్స్ కొంత మంది ఉన్నారు సాయి పల్లవి, నిత్యమీనన్, నివేద థామస్... ఇలా కమర్షియల్ హంగులకు దూరంగా.. మంచి మంచి మంచి సినిమాలు మాత్రయే చేసుకుంటూ.. స్కిన్ షోలకు ఛాన్స్ ఇవ్వకుండా బ్రతుకుతున్నారు. తమసినిమాలేవో తాము చేసుకుంటూ.. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అందులో నిత్యమీనన్ కూడా ఉంది.
Nithya menon
వారందరికటే ఈమె రూటు కాస్త సపరేటు. అదుకే నిత్యకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిత్య మీనన్ అంటే ఇషక్టపడటని వారు ఉండరు. ఆమె చేసే సినిమాలు కూడా అంత అద్భుతంగా ఉంటాయి మరి. తాజాగా ఆమె శ్రీమతి కుమారి అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సాధించింది.
Nithya menon
ఇక ప్రస్తుతం నిత్యమీనన్ పెళ్లి గురించి టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఆమె పెళ్లి అని రకరకాల వార్తులు వచ్చాయి. కాని వాటన్నిటిని కొట్టిపారేసింది బ్యూటీ తన పెళ్ళి గురించి పక్కాగా క్లారిటీ కూడా ఇచ్చేసింది. అయితే పెళ్లి విషయంలో నాకు స్థిరమైన అభిప్రాయం ఉందని నిత్యామీనన్ పేర్కొన్నారు. పెళ్లి అనేది సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడిపడి ఉన్న సెటప్ అని నిత్యామీనన్ వెల్లడించారు. ఎవరైనా దానికి మించి ఆలోచించేవాళ్లు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని నిత్యామీనన్ పేర్కొన్నారు.
పెళ్లి విషయంలో తన పేరెంట్స్ తనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని తెలిపింది. తన పెళ్లి విషయంలోనూ ఎప్పుడూ వారు ఒత్తిడి తీసుకురాకుండా చాలా సపోర్టివ్ గా ఉన్నారని చెప్పిందిఇంట్లో కాని.. బయట కానీ తనపై ప్రెజర్ తెచ్చేవారు ఎవరూ లేరు కాని.. తన బామ్మ మాత్రం తనను హీరోయిన్ గా చూడదన్నారు. తనకు వాల్యూ ఇవ్వకుండా మాటలతో టార్చర్ పెట్టేదన్నారు నిత్య. సూటి పోటి మాటలతో ఇబ్బంది పెట్టేదట. ఇన్నేళ్ల వయసు వచ్చింది ఎప్పుడు పెళ్లి చేసుకుంటావంటూ వేధించుకుని తినేదట బామ్మ.
ఇక సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి..కెరీర్ బిగినింగ్ నుంచి తను నమ్ముకున్న సిద్దాంతాలు లోబడే సినిమాలు చేస్తూ వస్తుంది నిత్య.నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకోని వరుస హిట్స్ తో దూసుకుపోతుంది నిత్యమీనన్. గ్లామర్ రోల్స్ చేస్తే కోట్లు ఇస్తామన్నా ఆమె టెమ్ట్ అవ్వలేదు.. నటనను మాత్రమే నమ్ముకుంది మలబారు బ్యూటీ.