సిక్కీం టూర్‌లో యాంకర్‌ వింధ్యా విశాఖ నాన్‌స్టాప్‌ ఎంజాయ్‌మెంట్‌.. ఐస్‌ రెయిన్‌లో మతిపోగొడుతుందిగా!

First Published | Jun 29, 2021, 7:48 PM IST

స్పోర్ట్స్ యాంకర్‌ వింధ్యా విశాఖ మేడపాటి ఇటీవల సిక్కీం టూర్‌లో తెగ ఎంజాయ్‌ చేసింది. ఆ ఫోటోలను పంచుకుని ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది. గడ్డ కట్టే ఐస్‌లో ఈ అమ్మడిని చూస్తే మతిపోతుందంతే. 
 

వింధ్యా విశాఖ స్పోర్ట్స్ యాంకర్‌గా ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఐపీఎల్‌తో మరింతగా పాపులర్‌ అయ్యిందీ భామ. ఓ వైపు టీవీ షోస్‌కి యాంకర్‌గా చేస్తూనే మరోవైపు క్రికెట్‌ మ్యాచ్‌లకు, క్రీడీ మ్యాచ్‌లకు యాంకరింగ్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది.
మార్చి నెలలో వింధ్యా సిక్కీం టూర్‌ వెళ్లింది. దాదాపు వారం రోజులపాటు తన ఫ్యామిలీతో అక్కడ ఎంజాయ్‌ చేసింది. అంతేకాదు అక్కడి విషయాలను వీడియో తీసి తన `వింధ్యా విశాఖ` యూట్యూబ్‌ ఛానెల్‌లో తాజాగా పంచుకుంది.

ఇప్పుడీ వీడియో బాగా ఆకట్టుకుంటోంది. ఆరు రోజుల పాటు తాను ఏమేం చేసింది వివరించింది వింధ్యా విశాఖ మేడపాటి. అదే సమయంలో తన యూట్యూబ్‌ ఛానెల్‌ని ప్రమోట్‌ చేసుకుంటుంది.
ఇటీవల చాలా మంది యాంకర్లు, సెలబ్రిటీలు సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించి తమ వీడియోలను, ఆసక్తికర, ఫన్నీ విషయాలను పంచుకుంటూ ఆడియెన్స్ ని, నెటిజన్లని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. వింధ్యా కూడా ఇదే మాదిరిగా తన యూట్యూబ్‌ ఛానెల్‌కి పాపులరిటీ తీసుకొస్తుంది.
మార్చి 11న సిక్కీం టూర్‌కి వెళ్లిన వింధ్యా అక్కడ చందు లేక్‌, వేడి వేడి ఫుడ్‌, చలికాచుకునేందుకు రెస్టారెంట్లో ఉన్న గ్యాస్‌ స్టవ్స్ గురించి వివరించింది. అక్కడ తనకిష్టమైన తెలుగు మ్యూజిక్‌ వింటూ జర్నీని ఎంజాయ్‌ చేసింది.
దీంతోపాటు ఇండియా,చైనా బార్డర్‌ ఏరియాని చూపించింది. అక్కడి విశేషాలను తెలిపింది. దీంతోపాటు మిలటరీ ఏరియాలో భారత్‌కి చెందిన హర్భజన్‌ అనే సోల్జర్‌ చనిపోయారని అతని ఆత్మ వచ్చి ఇక్కడ తన సమాధి నిర్మించాలని అక్కడి సైనికుల్లో ఒకరికి చెప్పడంతో అక్కడ ప్రత్యేకంగా అతని పేరుతో టెంపుల్‌ నిర్మించినట్టు తెలిపింది వింధ్యా. ఆయన ఆత్మ వారిని కాపాడుతుందని సైనికుల నమ్మకమట.
ఆ ఏరియాని చూస్తుంటే గూస్‌బమ్స్ వస్తున్నాయని, అద్బుతమైన ఫీలింగ్‌ అని తెలిపింది వింధ్యా.
అలాగే రోప్‌ వే, ఎమ్జీ మార్గ్‌లకు వెళ్లి ఆయా ప్రదేశాలను తిలకించి వాటి ప్రత్యేకతలను వివరించింది. అక్కడికి వెళ్లాలంటే పర్మిషన్‌ కావాలని, లేదంటే బుక్‌ అయిపోతామని చెప్పింది.
లాచిన్‌, నాగా హిల్స్, చోటా వ్యాలీ, గురుడోంగ్మర్‌ లేక్‌ వంటివి తిరిగినట్టు తెలిసింది వింధ్యా. అయితే గురుడోంగ్మర్‌ లేక్‌ వద్ద బ్రీథింగ్‌ సమస్య ఉంటుందట.
అక్కడి నుంచి జీరో పాయింట్‌, అలాగే పార్క్ లు, ఆనాటి కట్టడాలను, టెంపుల్స్, టీ తోటలు చూపిస్తూ ఎంజాయ్‌ చేసింది.
ఇదిలా ఉంటే ఐపీఎల్‌ 2021 మ్యాచ్‌లు స్టార్ట్ కావడానికి ముందు వింధ్యా ఇలా సిక్కీం టూర్‌ వేసింది. ఓ రకంగా ఐపీఎల్‌కి ముందు రిఫ్రెష్‌ అయి వచ్చిందని చెప్పొచ్చు.
సిక్కీం టూర్‌లో వింధ్యా విశాఖ..
సిక్కీం టూర్‌లో వింధ్యా విశాఖ..
సిక్కీం టూర్‌లో వింధ్యా విశాఖ..
సిక్కీం టూర్‌లో వింధ్యా విశాఖ..
సిక్కీం టూర్‌లో వింధ్యా విశాఖ..
సిక్కీం టూర్‌లో వింధ్యా విశాఖ..
సిక్కీం టూర్‌లో వింధ్యా విశాఖ..
సిక్కీం టూర్‌లో వింధ్యా విశాఖ..
సిక్కీం టూర్‌లో వింధ్యా విశాఖ..
సిక్కీం టూర్‌లో వింధ్యా విశాఖ..
సిక్కీం టూర్‌లో వింధ్యా విశాఖ..
సిక్కీం టూర్‌లో వింధ్యా విశాఖ..

Latest Videos

click me!