హీరో రాజశేఖర్, జీవిత తన శివాత్మిక నటిగా ఎంట్రి ఇచ్చి ఇప్పుడు గ్లామర్ ఫోటోలతో, మరోవైపు క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతుంది. ఈ మధ్య పంచుకున్న గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి.
తాజాగా ట్రెడిషనల్ వేర్‌లో కనువిందు చేసింది శివాత్మిక. గ్రే కలర్ లెహంగా ఓనీలో పరువాలు పోయింది. అంతేకాదు లెహంగా చాపలా పరిచేసి సిగ్గులతో ముగ్గేస్తుంది.
ఈ సందర్భంగా ఆమె పంచుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే ఈ కుర్ర భామ మరో బంపర్ ఆఫర్‌ని అందుకుంది. తమిళంలో ఓ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ప్రస్తుతం తెలుగులో `పంచతంత్రం` చిత్రంలో నటిస్తుంది. అలాగే కృష్ణవంశీ `రంగమార్తాండ` చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.
మరోవైపు తమిళంలోకి `ఆనందం విలయాడుమ్ వీడు` అనే సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇందులో గౌతమ్ కార్తీక్‌కి జోడిగా నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే తిరిగి షూటింగ్ ప్రారంభించుకోనుంది.
మరోవైపు ఇప్పుడు ఆర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రేమ కథా చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇందులో రీతూ వర్మ, అపర్ణ బాలమురళీ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రోడ్ జర్నీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టాక్.
ఈ సినిమాని అనౌన్స్ చేస్తూ, `నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది. అద్భుతమైన బృందంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా` అంటూ శివాత్మిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంతోషం వ్యక్తం చేసింది. నెమ్మదిగా క్రేజీ ప్రాజెక్ట్ లను అందుకుంటూ దూసుకుపోతుంది శివాత్మిక.