చాలా మంది యాంకర్స్ లో కొన్ని క్వాలిటీలు నాకు చాలా ఇష్టం. సుమ విషయానికి వస్తే ఆమె టైమింగ్, సమయస్ఫూర్తి అద్భుతం. ఆ టైమింగ్ ఎలా సాధ్యం అని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇక ఉదయభాను గారి విషయానికి వస్తే.. ఇన్నేళ్ల నుంచి ఆమె యాంకర్ గా ఉంటున్నారు. ఆమె గ్లామర్, లుక్స్ చెక్కు చెదరలేదు. అలా మైంటైన్ చేయడం ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతుంటా. ఇక యాంకర్ ఝాన్సీ గారికి సమాజం పట్ల ఉండే నాలెడ్జ్ ఇంకెవరికీ లేదు. ఆమెతో కాస్త టైం స్పెండ్ చేస్తే లైఫ్ గురించి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు అని వింధ్య తెలిపింది.