కర్మ తిరిగి బలంగా కొడుతుంది.. సమంత వైరల్ కామెంట్స్ షేర్ చేసిన వర్షిణి

Published : Oct 29, 2022, 02:08 PM IST

సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి  బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

PREV
16
కర్మ తిరిగి బలంగా కొడుతుంది.. సమంత వైరల్ కామెంట్స్ షేర్ చేసిన వర్షిణి
Samantha

సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి  బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత నెగిటివ్ షేడ్స్ లో నటించిన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం సమంత యశోద అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కి ముస్తాబవుతోంది. 

26

నాగ చైతన్యతో విడిపోయినప్పటి నుంచి సమంత పర్సనల్ లైఫ్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. సమంత గురించి రూమర్స్ కూడా వినిపించాయి. అయితే సమంత ఆ రూమర్స్ అన్నింటిని ధీటుగా ఎదిరించి నిలబడ్డారు. కెరీర్ పరంగా సామ్ వెనుకడుగు వేయడం లేదు. మరింత దూకుడుగా చిత్రాల్లో నటిస్తోంది.

36

సమంత ధైర్యాన్ని మెచ్చుకుంటూ చాలా మంది ప్రశంసలు కురిపించారు. సమంత ఏం చేసిన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. సమంత కూడా తన విడాకుల విషయం గురించి ఇంటర్వ్యూలలో మాట్లాడడం మొదలు పెట్టింది. 

46

విడాకుల సమయంలో తనకి ఎన్ని విమర్శలు, నిందలు ఎదురైనా సామ్ వాటిని తిప్పి కొట్టింది. అయితే తాజాగా హాట్ యాంకట్ వర్షిణి సమంత వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సమంత చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పుడు వర్షిణి ఈ వీడియో ఎందుకు షేర్ చేసింది అనేది తెలియడం లేదు. 

56

సమంత పడుతున్న కష్టాలు, ఆమె ధైర్యాన్ని మెచ్చుకునేందుకు ఈ వీడియో షేర్ చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. కర్మ అనేది ఒక బూమరాంగ్.. అది తిరిగి మనల్ని బలంగా కొడుతుంది' అంటూ సమంత ఎమోషనల్ గా చేసిన కామెంట్స్ ఉన్నాయి. 

66

సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని ఏడాది గడచిపోయింది. వారి కుటుంబాలతో పాటు ఫ్యాన్స్ కి కూడా ఇది చేదు జ్ఞాపకమే. నాగ చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్నాడు. సమంత యశోద, శాకుంతలం లాంటి క్రేజీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read more Photos on
click me!

Recommended Stories