రవితేజ, బాలకృష్ణ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఒక సినిమా చేయాల్సి వచ్చింది. పరుచూరి బ్రదర్స్ కారణంగా తనకు అవకాశం మిస్ అయ్యిందని రవితేజ తెలిపారు. ఆ మూవీ ఏంటి? అసలు ఏం జరిగిందంటే?
మాస్ మహారాజా రవితేజ ఇటీవలే `ఇరుముడి` మూవీతో బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. ఈ చిత్రం ఏకంగా రూ.250కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. అదే సమయంలో చాలా రోజుల తర్వాత రవితేజకి మంచి విజయాన్ని అందించింది. ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. వరుసగా ఐదు ఆరు సినిమాలు పరాజయం చెందిన నేపథ్యంలో అనూహ్యంగా `ఇరుముడి` మూవీ సంచలన విజయం సాధించి రవితేజ రేంజ్ ఏంటో చూపించింది. అయితే రవితేజ.. చిరంజీవి మాదిరిగానే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు. ప్రొడక్షన్‌లో అసిస్టెంట్ నుంచి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. దర్శకుడు కావాలనుకున్నారు. కానీ నటుడిగా టర్న్ తీసుకున్నారు.
25
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్‌గా ఎదిగిన రవితేజ
చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్నారు. పాజిటివ్, నెగటివ్ క్యారెక్టర్స్ చేసి మెప్పించారు. ఆ తర్వాత `నీ కోసం` సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నారు. ఆ తర్వాత హీరోగా నటిస్తూనే, మెయిన్ క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` మూవీతో రవితేజ కెరీర్ మారిపోయింది. ఈ మూవీ పెద్ద హిట్ కావడంతో ఇక హీరోగా నిలబడిపోయారు. `ఇడియట్` తో బిగ్ బ్రేక్ అందుకున్నారు. ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత రవితేజ లెక్క వేరే లెవల్ అని చెప్పొచ్చు. తన కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. హిట్లు పరాజయాలు ఉన్నాయి. పడిన ప్రతిసారి లేచాడు. తనని తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు.
35
బాలయ్యతో సినిమా చేయని రవితేజ
రవితేజ కెరీర్ ప్రారంభంలో చాలా మంది హీరోలతో కలిసి నటించాడు. నాగార్జున, చిరంజీవి, సుమన్, జగపతిబాబు, జేడీ చక్రవర్తి, రాజశేఖర్ ఇలా చాలా మంది హీరోల సినిమాల్లో క్యారెక్టర్స్ చేశారు. అలాగే చిరంజీవితో ఇటీవల మల్టీస్టారర్ కూడా చేశారు. కానీ బాలయ్యతో మాత్రం సినిమా చేయలేదు రవితేజ. అయితే ఒక సినిమా చేయాల్సింది. కానీ జస్ట్ లో మిస్ అయ్యింది. పరుచూరి బ్రదర్స్ కారణంగా రవితేజ ఆ ఆఫర్‌ని కోల్పోయాడు. ఆ వివరాల్లోకి వెళితే.. బాలయ్య హీరోగా విజయశాంతి హీరోయిన్‌గా `నిప్పురవ్వ` చిత్రం రూపొందింది. ఇందులో రాజా రవీంద్ర పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. హీరో చెల్లిని పెళ్లి చేసుకునే పాత్ర. నెగటివ్‌గా ఉంటుంది.
సినిమా ప్రారంభం సమయంలో జరిగిన ఆడిషన్ లో రవితేజ అటెండ్ అయ్యాడు. రాజా రవీంద్ర చేసిన పాత్రకి ఎంపికయ్యాడు. అప్పటికి రాజా రవీంద్ర లేడు. కానీ పరుచూరి బ్రదర్స్ రికమండేషన్‌తో దూరిపోయాడట. దీంతో రవితేజకి ఆఫర్ మిస్ అయ్యిందట. ఈ విషయాన్ని బాలయ్య నిర్వహించిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో రవితేజ వెల్లడించారు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
55
నిప్పురవ్వ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్
నిప్పురవ్వ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. బాలకృష్ణ, విజయశాంతి జంటగా నటించగా, అమ్రీష్ పూరి, రావు గోపాలరావు నెగటివ్ రోల్స్ చేశారు. 1993లో విడుదలైన ఈ చిత్రం పరాజయం చెందింది. అయితే ఈ మూవీ పోతుందని తనకు ముందే తెలుసు అని బాలయ్య చెప్పడం విశేషం. మొత్తంగా బాలకృష్ణ, రవితేజ కలిసి నటించాల్సిన మూవీ పరుచూరి బ్రదర్స్, రాజారవీంద్ర ల కారణంగా మిస్ అయ్యిందని చెప్పొచ్చు.