రచ్చరవి అంత మాట అనడంతో.. ప్రోమో కోసం ఇలా చేస్తారా అంటూ `క్యాష్‌` షో వదిలేస్తానని తేల్చి చెప్పిన యాంకర్‌ సుమ

Published : Apr 20, 2022, 01:46 PM ISTUpdated : Apr 20, 2022, 01:49 PM IST

స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల టాలీవుడ్‌లో టాప్‌ యాంకర్‌గా రాణిస్తున్నారు. ముఖ్యంగా `క్యాష్‌`షోని, సుమని విడదీసి చూడలేం. అలాంటిది సుమ రచ్చ రవి చేసిన పనికి తాను క్యాష్‌ షో ని వదిలేస్తానని తెలిపింది. 

PREV
17
రచ్చరవి అంత మాట అనడంతో.. ప్రోమో కోసం ఇలా చేస్తారా అంటూ `క్యాష్‌` షో వదిలేస్తానని తేల్చి చెప్పిన యాంకర్‌ సుమ

సుమ కొన్ని ఏళ్లుగా `క్యాష్‌` ప్రోగ్రామ్‌ని రన్‌ చేస్తుంది. కొత్త కొత్త టాస్క్ లతో, షోని సరికొత్తగా మారుస్తూ కొత్తపుంతలు తొక్కిస్తుంది. మంచి రేటింగ్‌తో రన్‌ చేయడంలో ముందుంటుంది. `క్యాష్‌` అంటూ సుమ,సుమ అంటే క్యాష్‌ అనేలా మారిపోయింది. సుమ లేకపోతే ఈ షో ఎవరు రన్‌ చేస్తారనే సందేహాలు కూడా కలుగుతుంటాయి. ఎవరూ ఆమె స్థానాన్ని భర్తీ చేయలేరు.

27

తాజాగా క్యాష్‌లో షాకింగ్‌ విషయాలు చోటు చేసుకుంటాయి. జనరల్‌గా ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు తమ బాధలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టిస్తుంటారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. పెద్ద గొడవైంది. అది యాంకర్‌ సుమకి, పాల్గొన్న నటుడు రచ్చ రవికి. మరి ఇద్దరి మధ్య గొడవేంటనేది చూస్తే.. 

37

లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో తనని ఒక్కసారి గెలిపించండి అంటూ వేడుకున్నారు. అంతకు ముందు కూడా చాలా సార్లు ఇలా రిక్వెస్ట్ చేశాడట రచ్చ రవి. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశా.. ఒక్కసారైనా విన్నింగ్‌ ఎపిసోడ్‌ ఇచ్చావంటూ అంటూ కాస్త ఘాటుగా స్పందించారు. అంతటితో ఆగలేదు. అక్కడ కూర్చొని ఎంత మందికి ఆన్సర్లు చెప్పావు అంటూ బాంబ్‌ పేల్చారు.

47

దీనికి అదే స్థాయిలో రియాక్ట్ అయ్యింది యాంకర్‌ సుమ. తాను ఎంత మందికి ఆన్సర్లు చెప్పినా అంటూ నిలదీసింది. ఏ ఊర్కో అమ్మా అంటూ ఏదో పెద్ద కామెంట్‌ చేశాడు రచ్చ రవి. దీంతో ఆ డైలాగ్‌ని బీఫ్‌ ఇచ్చారు. దీంతో ఓవరాక్షన్‌ చేయకంటూ రచ్చ రవికి కౌంటర్‌ ఇచ్చింది యాంకర్‌ సుమ. దీంతో షో మరింతగా వేడెక్కింది.

57

రచ్చ రవి మాటలకు బాగా హర్ట్‌ అయిన సుమ.. `అసలు ఏం అనుకుంటున్నారు మీరు. ప్రోమో కోసం ఏదేదో చేస్తున్నారు. స్టుపిడ్‌, ఇడియట్‌ అంటూ తన వద్ద ఉన్న ప్రోగ్రామ్‌ షీట్‌ ని కిందపడేసింది . ఇంకోసారి ఇలా చేస్తే షోస్‌ చేసేది లేదంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ఇది హాట్‌ టాపిక్‌ అవుతుంది. రచ్చ రవి, యాంకర్‌ సుమ ల మధ్య జరిగిన సన్నివేశాలు చేస్తూ ఆడియెన్స్‌ సైతం షాక్‌ కి గురికావడం విశేషం. 

67

తాజాగా విడుదలైన `క్యాష్‌` ప్రోగ్రామ్‌ ప్రోమోలోని సన్నివేశాలివి. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇది ఈ నెల 23న ఈటీవీలో సాయంత్రం ప్రసారం కానుంది. మరి సుమ,రవి మధ్య ఏం జరిగిందనేది తెలియాలంటే మరో మూడు రోజులు వేయిట్‌ చేయాల్సిందే. 
 

77

అంతకు ముందు సుమ, రచ్చ రవి మధ్య జరిగిన కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయించాయి. పందికొక్కుగా రవి యాక్ట్ చేసి నవ్వించారు, అలాగే ఇంకోవైపు ఆమె చేత మొట్టికాయలు వేయించుకుంటానని చెప్పి నవ్వులు చూపించారు. హెయిర్‌ ట్రాన్స్ ఫ్లాంటేషేన్ కూడా చేయించుకున్నానని చెప్పగా, `నాటు నాటు నాటు` అంటూ సుమ చేసిన కామెంట్లు కామెడీని పంచాయి. కానీ చివర్లో అలా జరగడం ఉత్కంఠతని రేకెత్తిస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories