సేవ చేయడానికి పవర్ కాదు.. దేవుని దయ ఉండాలి: పొలిటికల్ ఎంట్రీపై సోనూ సూద్ క్లారిటీ

Published : Apr 20, 2022, 01:29 PM ISTUpdated : Apr 20, 2022, 01:30 PM IST

పలు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన నటుడు సోనూ సూద్. అయితే తెలుగు చిత్రాల్లో ఆయన ఎక్కువగా నెగిటివ్‌ రోల్స్‌లోనే నటించాడు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. 

PREV
16
సేవ చేయడానికి పవర్ కాదు.. దేవుని దయ ఉండాలి: పొలిటికల్ ఎంట్రీపై సోనూ సూద్ క్లారిటీ

పలు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన నటుడు సోనూ సూద్. అయితే తెలుగు చిత్రాల్లో ఆయన ఎక్కువగా నెగిటివ్‌ రోల్స్‌లోనే నటించాడు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. 

26

కరోనా వల్ల ఇబ్బందులు పడిన చాలా మందికి తనవంతుగా సాయం అందించారు. వందలామంది వలస కూలీలు వారి వారి గమన్యస్థానాలకు చేరడాని సాయం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా సోనూ సూద్ పేరు మారుమోగింది. సోషల్ మీడియా వేదికగా సాధారణ ప్రజానీకమే కాకుండా.. పలువురు ప్రముఖులు కూడా సోనూ సూద్ సేవలను కొనియాడారు. 

36

అయితే ఈ క్రమంలోనే సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతుంది. రాజకీయాల్లోకి  వచ్చేందుకే సేవా కార్యక్రమాలు చేపట్టారని విమర్శిచిన వారు ఉన్నారు. అయితే వాటిని సోనూ సూద్ ఖండించారు. 

46

అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన సోదరి మాల్విక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో సోదరికి శుభాకాంక్షలు చెప్పిన సోనూ సూద్.. మాల్విక రాజకీయాలకు, తన సేవకు సంబంధం లేదని సోనూ సూద్ గతంలోనే స్పష్టం చేశారు. అయితే ఎన్నికల బరిలో నిలిచిన ఆమె ఓటమి పాలయ్యారు. 

56

అయితే తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై నటుడు సోనూ సూద్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. రాజకీయలోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను ఇంకా విస్తరిస్తానని చెప్పారు. 

66

సేవ చేయడానికి పవర్ కాదు.. దేవుని దయ ఉండాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్యాండమిక్ పోయింది కానీ సమస్యలు కాదన్నారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా రాబోతుందని ప్రకటించారు. కొన్ని స్కిప్ట్స్‌ని షార్ట్ లిస్ట్ చేశాననని చెప్పారు. 

click me!

Recommended Stories