డేటింగ్‌ విషయాన్ని కన్ఫమ్‌ చేసిన రష్మిక.. ఆ టైమ్‌లో రౌడీబాయ్ తోనే ఉన్నావంటూ ప్రూప్స్ బయటపెట్టిన నెటిజన్లు

First Published | Oct 9, 2023, 10:38 AM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఇటీవల వెకేషన్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది. అయితే ఇదిప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. విజయ్‌ దేవరకొండతోనే ఉన్నావంటున్నారు. 
 

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda), నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా(Rashmika Mandanna) డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. `గీతగోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఇద్దరు కలిసి నటించడం, ఆ తర్వాత రష్మిక మందన్నా పలు మార్లు విజయ్‌ దేవరకొండ ఇంటికి రావడంతో ఆ రూమర్లు ఊపందుకున్నాయి. 

దీనికితోడు పలు మార్లు ఈ ఇద్దరు వెకేషన్‌లో కనిపించారు. సేమ్‌ టైమ్‌లో ఎయిర్‌ పోర్ట్ లో సందడి చేశారు. అలాగే వెకేషన్‌లో ఇద్దరు ఒకే ప్లేస్‌లో సందడి చేస్తూ హింట్లు ఇస్తూ వస్తున్నారు. దీంతో రూమర్లు మరింతగా ఊపందుకున్నాయి. అదే సమయంలో రష్మిక కూడా పరోక్షంగా తన ప్రేమని వ్యక్తం చేస్తూనే ఉంటుంది. 
 


తాజాగా ఆమె క్లీయర్‌ కట్‌ హింట్‌ ఇచ్చేసింది. తన డెస్టినేషన్‌ వెతుక్కుంటూ వెళ్తున్నానని చెబుతూనే అసలు విషయం బయటపెట్టింది. దాన్ని కాస్త లేట్‌గా గుర్తించారు నెటిజన్లు. ప్రూప్‌లతో సహా ఆధారాలు బయటపెడుతున్నారు. ఆ సమయంలో విజయ్‌తోనే ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు. 
 

రష్మిక టర్కీలో వెకేషన్‌కి వెళ్లిన ఓ ఫోటోని, వీడియోని పంచుకుంది. అందులో ఫోటోకి కాప్షన్‌గా `డెస్టినేషన్‌` అని, రెండవది `తనని తాను కనిపెడుతున్నానని, ట్రావెలింగ్‌ డేస్ ని మిస్‌ అవుతున్నట్టు పేర్కొంది. అయితే అవి మే నెలలో దిగిన ఫోటోలుగా గుర్తించారు నెటిజన్లు. ఆ సమయంలో విజయ్‌ దేవరకొండ కూడా సేమ్‌ అదే లొకేషన్‌లో టిఫిన్‌ చేస్తూ కనిపించాడు. ఆ సమయంలో `ఖుషి` సినిమా షూటింగ్‌ జరుగుతుంది. సమంత కూడా ఆ షూటింగ్‌లో పాల్గొంది. 

దీంతో `ఖుషి` సినిమా షూటింగ్‌ టైమ్‌లో విజయ్‌, సమంతలతోపాటు రష్మిక కూడా అక్కడే ఉందని, అందుకే అదే డెస్టినేషన్‌లో తాను ఫోటో దిగిందని చెబుతున్నారు. ఇద్దరి ఫోటోలను మ్యాచ్‌ చేస్తూ ఇదిగో ప్రూప్‌ అంటూ బయటపెట్టడం విశేషం. దీంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలు, రష్మిక, విజయ్‌ల లవ్‌ హాట్‌ టాపిక్‌ అవుతుంది. వైరల్‌ అవుతుంది. 

ఇక విజయ్‌ దేవరకొండ, రష్మిక మరోసారి కలిసి నటించబోతుండటం విశేషం. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ డేట్స్ ఇష్యూతో ఆమె తప్పుకుంది. ఆ స్థానంలో రష్మికని తీసుకున్నారట. దీంతో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జంట కలిసి నటించబోతుందని చెప్పొచ్చు. అదే సమయంలో ఈ ఇద్దరి బాండింగ్‌ మరింత స్ట్రాంగ్‌ కాబోతుందని చెప్పొచ్చు. 
 

రష్మిక మందన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లో `యానిమల్‌` చిత్రంలో నటిస్తుంది. డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. దీంతోపాటు తెలుగులో `పుష్ప2` లో నటిస్తుంది. అలాగే `రెయిన్‌బో` అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తుంది. మరోవైపు విజయ్‌.. గౌతమ్‌ తిన్ననూరి సినిమాతోపాటు పరశురామ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి రాబోతుంది. 

Latest Videos

click me!