బుల్లితెరపై డ్యాన్స్ షోలు రసవత్తరంగా ఉంటాయి. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. హైపర్ ఆది కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచ్ తో పాటు గ్లామర్ ముద్దు గుమ్మలని ఇరకాటంలో పెట్టే విధంగా డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతుంటాడు.
ప్రస్తుతం ఢీ సెలెబ్రిటీ స్పెషల్ షో జరుగుతోంది. హైపర్ ఆది కామెడీ పంచ్ లతో, అల్లరి చేష్టలతో మధ్యలో వినోదం అందిస్తున్నాడు. డ్యాన్స్ కాంపిటీషన్ కావడంతో కంటెస్టెంట్స్ అంతా హీటెక్కించే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో రెచ్చిపోతున్నారు. ఇలాంటి పాపులర్ షోలకు తమ చిత్రాల ప్రమోట్ చేసుకునేందుకు తరచుగా సెలెబ్రిటీలు హాజరు కావడం చూస్తూనే ఉన్నాం.
తాజా ఢీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ షోకి యాంకర్ సుమ అతిథిగా హాజరైంది. ఆమె తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్ గమ్ చిత్రం రీసెంట్ గా విడుదలయింది. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. రోషన్ తన పాత్రలో అన్ని షేడ్స్ ప్రదర్శించాడు అని ప్రశంసలు దక్కుతున్నాయి.
హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో బోల్డ్ గా నటించాడు. దీనితో యువతని ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉన్నట్లు తెలుస్తోంది. మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం సుమ, రోషన్, మానస ఢీ షోకి హాజరయ్యారు.
ఇక ఈ షోలో అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత సుభాష్ జడ్జిగా వ్యవహరించింది. కంటెస్టెంట్స్ చేసే పెర్ఫార్మన్స్ చూసి ప్రణీత షాక్ అయింది. రోషన్ కనకాల, మానస ఎంట్రీ ఇవ్వగానే హైపర్ ఆది కామెడీ పంచ్ లతో రెచ్చిపోయాడు. నువ్వు సుమగారి అబ్బాయివి అని తెలుసు. కానీ మనదగ్గర రికమండేషన్స్ కుదరవు అంటూ పంచ్ వేశారు. హీరోయిన్ దగ్గరకి వెళ్లి ఫ్రీగా ఉండరా నాతో అంటూ నవ్వులు పూయించారు.
photo credit-sridevi drama company promo
స్వేత అనే అమ్మాయి మ్యాడ్ చిత్రంలోని పడితే లైన్లో పడతది అనే సాంగ్ కి అదిరిపోయే విధంగా పెర్ఫామ్ చేసింది. నోట్లో నీళ్లు పోసుకుని మళ్ళీ ఉమ్మేస్తూ చేసిన డ్యాన్స్ మూమెంట్ కొత్తగా అనిపించింది. ఆమె డ్యాన్స్ పై సుమ ఫన్నీగా స్పందించింది. స్వేత నేను చెప్పిన మూమెంట్ ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి అని అడిగింది. మధ్యలో హైపర్ ఆది కలగజేసుకుని ఇంతగా చెబుతున్నారు కాబట్టి సుమగారే ఆ స్టెప్పు వేస్తారు అని అన్నాడు.
సుమ డ్యాన్స్ చేస్తూ నోట్లో నీళ్లు పోసుకుని ఊస్తూ ఉంటుంది. ఆ నీటిని హైపర్ ఆది బకెట్ తో పట్టుకుంటాడు. కానీ ఒకసారి సుమ ఏకంగా హైపర్ ఆది ముఖం మీదే డైరెక్ట్ గా ఉమ్మేస్తుంది. వాళ్ళు ఫన్నీగా చేసినప్పటికీ చూడడానికి అది చాలా అసభ్యంగా ఉంది. సుమ పబ్లిసిటి స్టంట్ పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎంత ఫన్నీగా చేసినా సాటి వ్యక్తిపై ఉమ్మేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సుమని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తన కొడుకు సినిమా పబ్లిసిటీ కోసమే సుమ ఈ విధంగా దిగజారి ప్రవర్తిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హైపర్ ఆది ఈ సంఘటనని ఫన్నీగానే తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా హైపర్ ఆది తనదైన శైలిలో కామెడీ పంచ్ లు వేశాడు. సుమ.. ప్రణీతని అడుగుతూ న్యూ ఇయర్ లో ఏం చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించింది. తనకు తెలుగు యాంకరింగ్ చేయాలని ఉన్నట్లు ప్రణీత చెప్పగా.. హైపర్ ఆది బదులిస్తూ.. అవునా మాకు రష్మీ అనే యాంకర్. ఆమె యాంకరింగ్ చూడండి మీ కోరిక చచ్చిపోతుంది అని ఫన్నీగా సెటైర్లు వేశాడు.