హాఫ్‌ శారీలో కట్టిపడేస్తున్న యాంకర్‌ సుమ.. `జయమ్మ పంచాయితీ`కి అందుకుంటోన్న పారితోషికం ఎంతంటే?

Published : Mar 06, 2022, 11:46 AM IST

సుమ కనకాల.. తెలుగు చిత్ర పరిశ్రమలో, తెలుగు టీవీ రంగంలో తిరుగులేని యాంకర్‌గా రాణిస్తున్నారు. అంతేకాదు అత్యంత కాస్ట్లీ యాంకర్‌ కూడాను. లేటెస్ట్ గా ఆమె హాఫ్‌లో కనిపించి కట్టిపడేస్తుంది. 

PREV
17
హాఫ్‌ శారీలో కట్టిపడేస్తున్న యాంకర్‌ సుమ.. `జయమ్మ పంచాయితీ`కి అందుకుంటోన్న పారితోషికం ఎంతంటే?

యాంకర్‌ సుమ(Anchor Suma) గ్లామర్‌ సైడ్‌ ఎప్పుడూ వెళ్లలేదు. ట్రెడిషనల్‌ లుక్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. తనదైన మాట తీరుతో, చలాకీతనంతో, స్పాంటీనియస్‌ గా రియాక్ట్ అవుతూ, పంచ్‌లు వేస్తూ ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఆమె ప్రధానంగా యాంకర్‌గా వ్యవహరించే షోస్‌లో `క్యాష్‌` ఒకటి. ఈటీవీలో ప్రతి శనివారం రాత్రి ఇది ప్రసారమవుతుంది. అత్యంత ప్రజాదరణ పొందిన షో ఇది. అంతేకాదు చాలా కాలంగానూ రన్‌ అవుతుంది. 
 

27

ఈ షో కోసం అందంగా ముస్తాబైంది యాంకర్‌ సుమ. హాఫ్‌ శారీలో హోయలు పోయింది. ఏజ్‌ పరంగా 40 ప్లస్‌ అయిన ఈ స్టార్‌ యాంకర్‌.. ట్రెడిషనల్‌ లుక్‌లోనూ కట్టిపడేస్తుంది. తాజాగా పింక్‌ కలర్‌ హాఫ్‌ శారీలో ఆమె పంచుకున్న ఫోటోలు నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. అయితే ఇందులో సుమ లుక్స్ చాలా క్యూట్‌గా ఉండటం విశేషం. 
 

37

అయితే ఈ సందర్భంగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మీరు అందాన్ని తింటారా? ఎప్పుడూ ఇలానే ఉంటారని, చిన్నప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలానే ఉన్నారని కామెంట్లు చేయడ విశేషం. అంతేకాదు కొంత మంది క్యూట్‌గా ఉన్నావని పోస్ట్ పెట్టగా, మరికొంత మంది కొంటె నెటిజన్లు మాత్రం ఫైర్‌ ఎమోజీలను పంచుకోవడం విశేషం. మొత్తంగా యాంకర్‌ సుమ సైతం హాట్‌ యాంకర్లైన అనసూయ, రష్మి, శ్రీముఖిలకు గ్లామర్‌ సైడ్ కూడా పోటీనిస్తుండటం మరో విశేషంగా చెప్పొచ్చు. 

47

దాదాపు రెండు దశాబ్దాలకుపైగా తిరుగులేని యాంకర్‌గా రాణిస్తున్న సుమ కనకాల మరోసారి నటి అవతారం ఎత్తింది. ఆమె కెరీర్‌ బిగినింగ్‌లో నటిగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మధ్యలో గ్యాప్‌ ఇచ్చి పూర్తిగా యంకరింగ్‌ వైపు వెళ్లిన సుమ.. ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తూ ఓ సినిమా చేస్తుంది. 

57

`జయమ్మ పంచాయితీ` పేరుతో ఈ చిత్రం రూపొందుతుండగా, ఇందులో సుమనే లీడ్‌ రోల్‌ పోషిస్తున్నారు. నూతన దర్శకుడు విజయ్‌ కుమార్‌ కొలివరపు దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్‌ రోల్‌లో సుమ కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి యాంకర్‌ సుమ తీసుకుంటున్నట్టు రెమ్యూనరేషన్‌ లీక్‌ అయ్యింది. 

67

యాంకర్‌ సుమ టీవీ షోస్‌తోపాటు సినిమా ఈవెంట్లు కూడా చేస్తుంది. వీటికిగానూ ఆమె సినిమా స్థాయిని బట్టి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు తీసుకుంటుంది.  అయితే ఇప్పుడు `జయమ్మ పంచాయితీ`కి ఎంత తీసుకుంటున్న పారితోషికం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకిగానూ ఆమె ఏకంగా యాభై లక్షలు తీసుకుంటుందట. ఓ హీరోయిన్‌ రేంజ్‌ పారితోషికం సుమ అందుకుంటుందని చెప్పొచ్చు. సుమకి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా నిర్మాతలు కూడా నో చెప్పలేదని టాక్. 
 

77

ఇక యాంకర్‌గా సుమ ఫుల్‌ బిజీగా ఉంది. ఆమె `క్యాష్‌` ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా చేస్తుంది. `స్టార్ట్ మ్యూజిక్‌` షోలకు హోస్ట్ గా చేస్తుంది. మరోవైపు సినిమా ఈవెంట్లకి ఫస్ట్ ఆప్షన్‌ సుమ అనే విషయం తెలిసిందే. దీంతోపాటు ఇటీవల సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ స్టార్ట్ చేసిన సుమ.. అందులో వంటల కార్యక్రమాలు, సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories