పాలరోజా చీరలో చందమామలా మైమరిపిస్తున్న యాంకర్ సుమ... ఆమె గ్లామరస్ లుక్ వైరల్!

Published : Aug 27, 2023, 02:16 PM IST

స్టార్ యాంకర్ సుమ కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా ఆమె పాల రోజా రంగు చీరలో మెస్మరైజ్ చేశారు.   

PREV
15
పాలరోజా చీరలో చందమామలా మైమరిపిస్తున్న యాంకర్ సుమ... ఆమె గ్లామరస్ లుక్ వైరల్!
Anchor Suma

యాంకర్ సుమ పరిచయం అక్కర్లేని పేరు. ఈ లెజెండరీ యాంకర్ సైతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్నారు. తాజాగా నల్ల చీరలో చూపులు తిప్పుకోకుండా కట్టిపడేసింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 


 

25
Anchor Suma

90లలో సుమ నటిగా కెరీర్ మొదలుపెట్టారు. దాసరి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. మరో  రెండు మూడు మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. బ్రేక్ రాలేదు. దీంతో యాంకర్ అవతారం ఎత్తారు. తిరుగులేని ఆధిపత్యం సాధించారు. 

35
Anchor Suma

రెండు దశాబ్దాలుగా యాంకర్ సుమ స్థానం పదిలంగా ఉంది. సుమ షోలో ఉన్నారంటే వినోదం పరుగులు పెడుతుంది. ఆమె టైమింగ్ పంచ్లు షోకి హైలెట్ గా నిలుస్తాయి. అందుకే దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం సాగుతుంది. నాలుగైదు భాషలు సుమ అనర్గళంగా మాట్లాడుతుంది. 

45
Anchor Suma

కాగా సుమ గతంలో మాదిరి షోలు చేయడం లేదు. విరివిగా షోలే చేసే సుమ తగ్గించారు. ప్రస్తుతం సుమ అడ్డా టైటిల్ తో సుమ ఒక షో చేస్తున్నారు. అలాగే అమ్మ ఆవకాయ టైటిల్ తో మరో షో స్టార్ట్ చేసినట్లు సమాచారం. అప్పుడప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు. 

 

55
Anchor Suma Kanakala

సుమకు డిమాండ్ ఉన్నా ఆచితూచి ప్రోగ్రామ్స్ ఎంచుకుంటున్నారు. గత ఏడాది జయమ్మ పంచాయతీ టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేశారు. ఇక కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. యాంకర్ గా ఏకఛత్రాధిపత్యం చేసిన సుమకు వందల కోట్ల ఆస్తి ఉన్నట్లు సమాచారం. 

click me!

Recommended Stories