సరికొత్త అందాలతో ఆకట్టుకుంటున్న యాంకర్ సుమ... లంగా ఓణీలో మనోహరంగా!

Sambi Reddy | Published : Sep 26, 2023 8:39 PM
Google News Follow Us


 యాంకర్ సుమ పంథా మార్చారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ అయిన స్టార్ లేడీ వరుస ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. సుమ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

15
సరికొత్త అందాలతో ఆకట్టుకుంటున్న యాంకర్ సుమ... లంగా ఓణీలో మనోహరంగా!
Suma Kanakala

సుమ కనకాల సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి తనలోని తెలియని కోణం పరిచయం చేస్తుంది. తాజాగా సుమ లంగా ఓణీ ధరించారు. ఐదు పదుల వయసు దగ్గరపడుతున్నా కట్టిపడేసే గ్లామర్ తో ఆకట్టుకుంటున్నారు. సుమ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

 


 

25
Suma Kanakala

యాంకర్ గా బుల్లితెర మీద సుం చెరగని ముద్ర వేశారు. ఆమె ఘన చరిత్ర ఎవరు అందుకోలేనిది. ఆమె సై అంటే నిర్మాతలు పలు షోలను ఆమె సారథ్యంలో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఏళ్ళ తరబడి ఒకే పని చేయడంతో బోర్ కొట్టిందేమో కానీ సుమ షోలు తగ్గించింది. ప్రస్తుతం సుమ అడ్డా, అమ్మ ఆవకాయ్ వంటి రెండు షోలు మాత్రమే చేసింది. 

35
Suma Kanakala

1996లో నటిగా సుమ ప్రస్థానం మొదలైంది. దాసరి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. మరో  రెండు మూడు మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. బ్రేక్ రాలేదు. దీంతో యాంకర్ అవతారం ఎత్తారు. తిరుగులేని ఆధిపత్యం సాధించారు. 
 

Related Articles

45
Suma Kanakala

గత పాతికేళ్లుగా సుమ స్టార్ యాంకర్ హోదాలో కొనసాగుతున్నారు. సుమ షోలో ఉన్నారంటే వినోదం పరుగులు పెడుతుంది. ఆమె టైమింగ్ పంచ్లు షోకి హైలెట్ గా నిలుస్తాయి. అందుకే దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం సాగుతుంది. నాలుగైదు భాషలు సుమ అనర్గళంగా మాట్లాడుతుంది. 

 

55
Suma Kanakala

 సుమ రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవ  ఆమె రాజీవ్ కనకాలతో విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ విడివిడిగా ఉంటున్న నేపథ్యంలో మనస్పర్థలు తలెత్తాయంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను రాజీవ్ కనకాల ఖండించారు. ఇక సుమకు ఓ అబ్బాయి, అమ్మాయి సంతానం. అబ్బాయిని హీరో చేసే ప్రయత్నాల్లో ఆమె ఉన్నారు. 

Recommended Photos