సుమకు షోలు తగ్గిపోవడానికి వాళ్లే కారణం... అసలు మేటర్ బయటపెట్టిన భర్త రాజీవ్ కనకాల 

Sambi Reddy | Updated : Feb 06 2024, 08:45 AM IST
Google News Follow Us


బుల్లితెర మీద యాంకర్ సుమ జోరు తగ్గింది. అయితే సుమకు షోలు తగ్గడానికి కారణం ఏమిటో భర్త రాజీవ్ కనకాల వివరించాడు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

17
సుమకు షోలు తగ్గిపోవడానికి వాళ్లే కారణం... అసలు మేటర్ బయటపెట్టిన భర్త రాజీవ్ కనకాల 
Anchor Suma Kanakala

రెండు దశాబ్దాలకు పైగా సుమ బుల్లితెరపై మహారాణిగా వెలిగిపోతున్నారు. పదుల సంఖ్యలో ఆమె షోలు చేశారు. ఈటీవి, స్టార్ మా, జీ తెలుగు, జెమినీ వంటి ప్రముఖ ఛానల్స్ లో పలు పాప్యులర్ షోలకు యాంకర్ గా వ్యవహరించారు. 


 

27

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్, టాలీవుడ్ స్పెషల్ ఈవెంట్స్ అయితే లెక్కే లేదు. అయితే ఈ మధ్య సుమ చేస్తున్న షోల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం ఆమె సుమ అడ్డా పేరుతో ఒక షో చేస్తున్నారు. కేవలం ఆ ఒక్క షో మాత్రమే ఆమె ఖాతాలో ఉంది. గతంలో కనీసం అరడజను షోలతో బిజీగా ఉండేది. 

37

సుమకు షోలు తగ్గడానికి కారణం ఏమిటో భర్త రాజీవ్ కనకాల వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... సుమ రాకతో నా జీవితమే మారిపోయింది. ఆర్థికంగా, మానసికంగా దృఢంగా తయారయ్యాము. మా నాన్న చేసిన అప్పులు ఇద్దరం కష్టపడి తీర్చాము. 

 

Related Articles

47

అప్పుల బాధ తాళలేక నాన్న ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నారు. ఆ స్థితి నుండి ఆస్తులు సంపాదించే స్థాయికి వెళ్ళాము. ఈ స్థాయికి రావడం వెనుక సుమ కష్టం ఎంతగానో ఉందని రాజీవ్ అన్నాడు. 
 

57

ఎంత బిజీగా ఉన్నా సుమ పిల్లలను నిర్లక్ష్యం చేయలేదు. సాయంత్రం ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చేస్తుంది. ఆలస్యం అయ్యేలా ఉంటే... పిల్లలను కూడా షూటింగ్ కి తీసుకెళ్లేది. వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవకుండా చూసుకునేది. సుమకు షోలు తగ్గిపోవడానికి పిల్లలే కారణం. 
 

67
Anchor Suma Kanakala


పిల్లలతో కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అందులో షోలు చేస్తుంది. మావి గవర్నమెంట్ జాబ్స్ కాదు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి షోలు చేస్తున్నాము... అని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు. 
 

77

కాగా ఆ మధ్య సుమ-రాజీవ్ విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కొన్నాళ్ళు సుమకు దూరంగా తండ్రి ఇంట్లో ఉన్న మాట వాస్తవమే కానీ, అందుకు విబేధాలు కారణం కాదు. వేరొక రీజన్ తో అక్కడ కొన్నాళ్ళు ఉన్నానని రాజీవ్ అనంతరం వివరణ ఇచ్చారు. ఇటీవల సుమ కొడుకు రోషన్ బబుల్ గమ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Recommended Photos