Guppedantha Manasu
Guppedantha Manasu 6th February episode: మహేంద్ర హాస్పిటల్ కి వెళ్లాడు అనగానే ఫణీంద్ర చాలా కంగారుపడిపోతాడు. అయితే.. దేవయాణి కంగారుపడొద్దని.. రిషికి ఏమీ కాదు అని చెబుతుంది. ఫణీంద్ర మాత్రం తాను ఇప్పుడే మహేంద్ర ఇంటికి వెళ్లాలి అంటాడు. అయితే... హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాడు కదా.. అప్పుడు వెళ్లొచ్చు కదా అని దేవయాణి అంటుంది. ఆ మాటకు ఫణీంద్ర తిడతాడు. నేను మాత్రం వెళ్తున్నాను అని బయలుదేరతాడు. ధరణి నేను కూడా వస్తాను మామయ్య అంటుంది. ఇక చేసేది లేక.. శలేంద్ర దేవయాణి కూడా మేము వస్తాం అంటారు.
Guppedantha Manasu
ఇక ఇంట్లో వసుధార, అనుపమ కూర్చొని ఉంటారు. అనుపమను చక్రపాణి ఒకసారి మహేంద్ర గారికి ఫోన్ చేయండమ్మ అంటాడు. అయితే.. ఫోన్ ఎందుకు నాన్న.. మామయ్య వచ్చేస్తారు.. అది రిషి సర్ ది కాదు అని చెబుతారు. అని అంటూ ఉంటుంది. అప్పుడే ముకుల్.. మహేంద్రను తీసుకొని వస్తాడు. వెంటనే.. వసుధార.. ఏమైంది మామయ్య అది రిషి సర్ ది కాదు కదా, ముకుల్ గారు పొరపాటు పడ్డారు కదా అని అంటుంది. కానీ.. మహేంద్ర తన దుఖాన్ని అంతా ఆపుకొని.. అది పొరపాటు కాదమ్మా.. మన రిషి దే అంటూ ఏడ్చేస్తాడు.
Guppedantha Manasu
కానీ వసుధార నమ్మదు.. మీరు అబద్దం చెబుతున్నారు అని అంటుంది. కానీ.. డీఎన్ఏ టెస్టు చేశారని.. అది రిషి డెడ్ బాడీనే అని మహేంద్ర చెబుతాడు. అప్పటికే.. ఫణీంద్ర వాళ్లు కూడా అక్కడికి చేరుకుంటారు. ఏమైంది మహేంద్ర అని పణీంద్ర అంటే.. రిషి మనకు లేడు అన్నయ్య అని ఏడుస్తాడు. ఆ మాట విని రిషి గాడు లేడా.. అని శైలేంద్ర చాలా సంతోషపడతాడు. దేవయాణి ముఖంలోనూ నవ్వు కనిపిస్తుంది.
Guppedantha Manasu
కానీ వసుధార మాత్రం.. నేను ఒప్పుకోను అని అరుస్తూ ఉంటుంది. కొన్ని నిజాలు అలానే బాధగా ఉంటాయి మేడమ్.. మేము ఒకటికి రెండు సార్లు చెక్ చేయకుండా ఏది కన్ఫామ్ చేయము అని ముకుల్ అంటాడు. వసు మాత్రం.. మీరు ఎన్ని చెప్పినా.. ఎంత మంది చెప్పినా.. నేను మాత్రం నమ్మను అని అంటూ ఉంటుంది. నేను డైరెక్ట్ గా చూడాల్సిందే అని వసుధార అంటుంది. అయితే.. నువ్వు చూసినా ఏమీ తెలియదమ్మ అని మహేంద్ర ఏడుస్తాడు.. మీరు గుర్తుపట్టగా లేనిది నేను ఎందుకు గుర్తుపట్టలేను అని వసుధార అడిగితే... రిషి అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు అని మహేంద్ర అంటాడు.. అయితే.. మరి ఎలా గుర్తుపట్టారు అని వసు అడుగుతుంది. డీఎన్ఏ టెస్టు చేశారని మహేంద్ర అంటే.. మీరు ఫేస్ చూడలేదు కాబట్టి.. అది రిషి సర్ కాదు అని అంటుంది.. వసుని ఎలా నమ్మించాలో అర్థం కాక మహేంద్ర ఏడుస్తాడు.
Guppedantha Manasu
అయితే.. శైలేంద్ర.. డీఎన్ఏ టెస్టులో తేలింది అని చెబుతున్నారు కదా అని ఏదో చెప్పబోతాడు. దానికి వసుధార.. నీలాంటివాడు ఎవరో రిపోర్టు మార్చి ఉంటారు అని అంటుంది. శైలేంద్ర కాలర్ పట్టుకొని.. చెప్పురా చెప్పు అంటూ బెదిరిస్తుంది. అందరూ.. వసుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే..దేవయాణి.. తన కొడుకును ఏదైనా అంటే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. అయితే.. నేరాలు చేసేది మీరే కదా అని వసు అంటుంది.
Guppedantha Manasu
అయితే.. రిషి చనిపోయాడని తెలిసి.. వసుధార మెంటల్ గా డిస్టర్బ్ అయ్యింది అని దేవయాణి అంటుంది. ఆ మాటకు వసుకి మరింత కోపం వస్తుంది. సీరియస్ అవుతుంది. రిషి సర్ చనిపోయాడు అని అంటుందా అని కోపంగా మీదకు వెళ్తుంది. అయితే.. అనుపమ ఆపి.. ఆమె మాత్రమే కాదు అందరూ అదే చెబుతున్నారు. మహేంద్ర కూడా అదే చెబుతున్నాడు అని అంటుంది.
Guppedantha Manasu
వసు మాత్రం.. లేదు.. మీరు ఏదేవో ఆలోచిస్తున్నారు అని అరుస్తుంది. అప్పుడే ముకుల్ వచ్చి వసుకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాడు.మీరు నమ్మినా నమ్మకున్నా.. రిషి సర్ చనిపోయాడు అనేది నిజం.. ఇదిగో ప్రూఫ్ అని చూపిస్తాడు. మీరు బాధపడినా.. రిషి సర్ లేడు అనేది నిజం అని ముకుల్ తేల్చి చెబుతాడు. ఇది మీ మనసుకు కష్టంగా ఉంటుందని తెలుసని.. జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుందని తెలుసు కానీ. అదే నిజం అని.. రిషి సర్ చనిపోయారు అని ముకుల్ అంటాడు..
కానీ వసు.. అబద్దం... రిషి సర్ బతికే ఉన్నారు. అందుకు నా ఊపిరే సాక్ష్యం. రిషి సర్ ఎక్కడ ఉన్నా.. నేను వెతికి పట్టుకొస్తాను అని బయటకు వెళ్తుంది.
Guppedantha Manasu
ఈలోగా.. ఫణీంద్రకు అదంతా చూసి హార్ట్ ఎటాక్ వస్తుంది. అందరూ.. ఆయన దగ్గరకు పరుగులు తీస్తారు. వసు మాత్రం.. బయటకు వచ్చి.. మీరు ఎక్కడ ఉన్నారు రిషి సర్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఎవరు చెప్పినా నేను నమ్మను అని.. మీరు బతికే ఉన్నారని.. ఆ దేవుడే చెప్పినా, లోకమంతా చెప్పినా నేను నమ్మను అంటుంది.
అప్పుడే వసుకి వాళ్ల బావ రాజీవ్ వచ్చి వాటర్ బాటిల్ ఇస్తాడు. ముఖం చూడకుండా బాటిల్ అందుకుంటుంది. రాజీవ్ ని చూసి వాటర్ కూడా తాగకుండా ఆగిపోతుంది. ఆ బాటిల్ ని విసిరి కొడుతుంది. దాహంగా ఉన్నా కూడా బాటిల్ పడేశావేంటి మరదలు పిల్లా అని రాజీవ్ అంటాడు. తర్వాత.. ఎలా ఉన్నావ్?. చాలా కాలం తర్వాత నిన్ను చూసే దర్శన భాగ్యం దొరికింది అని ఏదేదో మాట్లాడుతూనే ఉంటాడు. వాడి మాటలకు వసుధారకు చిరాకు పడుతూ ఉంటుంది. అయినా కూడా రాజీవ్ ఆగడు. అడుగుతూనే ఉంటాడు.
Guppedantha Manasu
దానికి వసుధార.. అసలు నవ్వు ఎందుకు వచ్చావ్..? మళ్లీ నా వెంట ఎందుకు పడుతున్నావ్ అని అడుగుతుంది. అదేంటి వసు.. ప్రేమగా నీ దగ్గరకు వస్తే అలా అంటావ్.. నువ్వు కష్టాల్లోఉన్నావని పలకరిద్దాం అని వచ్చాను అని అంటాడు. రిషి చనిపోయాడు అంట కదా.. అంటాడు. అయితే.. వసు మాత్రం రిషి సర్ చనిపోలేదు అంటుంది. కానీ.. రిషి చనిపోయాడని..ఈ విషయం అందరికీ తెలుసు అని , రిషి ని తలుచుకుంటే బాధగా ఉందని.. చక్కని హెయిర్ స్టైల్, ఐరన్ దుస్తులు హీరోలా ఉండేవాడని.. కానీ చనిపోయాడు అని అంటాడు.
కానీ.. రిషి సర్ చనిపోయారు అనే మాట ఇంకోసారి అంటే ఊరుకోను అని వసుధార వార్నింగ్ ఇస్తుంది. దానికి రాజీవ్.. అంత ఆవేశం వద్దు వసుధార.. అసలే ఇప్పుడు నువ్వు దిక్కు లేనిదానివి అంటాడు. వసు కోపంగా చూసినా పట్టించుకోడు. నీ చూపులకు నేను పడిపోతాను కానీ.. భయపడను అంటాడు. రిషి చనిపోయాడు కాబట్టి.. నీకు బాధ ఉంటుంది.. గుండెల్లో బాధ తీరేంత వరకు ఏడు.. ఒంటరిగా ఉండాలని మాత్రం అనుకోకు... నీకు తోడుగా నేను ఉంటాను అని ఓ తాళి బయటకు తీస్తాడు.
Guppedantha Manasu
అయితే.. వసుధార కోపం వచ్చి రాజీవ్ చెంప పగలకొడుతుంది. అయినా సిగ్గులేకుండా.. నువ్వు కొట్టావని నేను ఫీలవ్వను.. నీ స్పర్శ తాకినందుకు సంబరపడతాను అని బలవంతంగా వసుధారను లాక్కెళుతూ ఉంటాడు. అప్పుడే కొత్త హీరో ఎంట్రీ ఇస్తాడు. ఫేస్ తప్ప మొత్తం చూపించారు. మరి ఆ కొత్త హీరో ఎవరు అనేది తెలియాలంటే.. రేపటి వరకు ఆగాల్సిందే. రిషి అయితే కాదు అని తెలుస్తోంది.. ఎందుకంటే.. గొంతు రిషిది కాదు.