Sreemukhi : సముద్రపు అలకు వణికిపోయిన శ్రీముఖి.. బీచ్ లో స్టార్ యాంకర్ ఎలా భయపడిందో చూడండి.!

First Published | Dec 6, 2023, 8:05 AM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి తాజాగా తన వెకేషన్ వీడియోను పంచుకుంది. ఉవ్వెత్తున వచ్చిన సముద్రపు అలకు ఒక్కసారిగా భయపడి పోయింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

ఓవైపు తమిళనాడు, ఏపీలో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వరదలు, వర్షాలకు ప్రజలు అల్లకల్లోలం అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా శ్రీముఖి పంచుకున్న వెకేషన్ వీడియో ఆసక్తికరంగా మారింది.

స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi )  సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన గురించిన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. క్రేజీగా పోస్టులు పెడుతూ ఆక్టుకుంటుంది. 


రీసెంట్ గా థాయిలాండ్ వెకేషన్ కు సంబంధించిన వీడియోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ఆసక్తికరంగా మారింది. బీచ్ వేర్ లో వాతావరణాన్ని ఎంజాయి చేస్తున్న శ్రీముఖికి ఒక్కసారిగా భయపడే వాతావరణం ఏర్పడింది.

బీచ్ ఒడ్డున నిల్చుని సముద్రపు అలను వీక్షిస్తూ వీడియోకు స్టిల్స్ ఇచ్చింది. అదే  సమయంలో ఉవ్వెత్తున వచ్చిన అల శ్రీముఖిని ఒడ్డుకు నెట్టేసింది. దీంతో భయపడిపోయింది. చివర్లో అలా జరగడంపై అభిమానులతో పంచుకుంది. 

ప్రస్తుతం మిచౌంగ్ తుఫాన్ తమిళనాడు, ఏపీని భయపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటి వీడియోను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలనే సూచనలు ఇచ్చింది. 

ఆ వీడియోలో శ్రీముఖి అలకు పడిపోవడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఇలాంటి వెకేషన్లకు వెళ్లినప్పుడు జాగ్రత్త అక్క అంటూ తెలుపుతున్నారు. ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెరపై ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’, ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ సీజన్ 2’షోలతో సందడి చేస్తోంది. 

Latest Videos

click me!