ట్రెండీ అవుట్ ఫిట్ లో రాములమ్మ ఊరమాస్ స్టిల్.. శ్రీముఖి పోజులకు మైండ్ బ్లాకే.!

First Published | Mar 6, 2023, 3:09 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) బుల్లితెర ప్రేక్షకులను  బ్యాక్ టు బ్యాక్ షోలతో అలరిస్తూనే ఉన్నారు. మరోవైపు స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా శ్రీముఖి పంచుకున్న పిక్స్ వైరల్ గా మారింది.
 

అందాల యాంకర్ శ్రీముఖి గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా తనదైన ముద్ర వేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ షోలతో ఇప్పటికీ బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది. 
 

ప్రస్తుతం శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలలో BB Jodi ఒకటి. బిగ్ బాస్ తెలుగు రియాలిటీషోలోని కంటెస్టెంట్లతో డాన్స్ షోను నిర్వహిస్తున్నారు. స్టార్ మా ఛానెల్ మరియు డిస్కీ ప్లస్ హాట్ స్టార్ లో ఈషో ప్రసారం అవుతుంది. ప్రతి శనివారం, ఆదివారం సాయంత్రం 9 గంటలకు రానుంది. 
 


గతేడాది డిసెంబర్ 25 నుంచి ఈషో ప్రారంభం అవుతోంది. రాధా, తరుణ్ మాస్టర్, సదా షోకు జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. షోలోని ప్రతి ఎపిసోడ్ లో శ్రీముఖి అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. 

ఈ సందర్భంగా లేటెస్డ్ ఎపిసోడ్ కోసం స్టన్నింగ్ అవుట్ ఫిట్  ధరించింది. మైండ్ బ్లోయింగ్ గా ఫొటోలకు ఫోజులిస్తూ అట్రాక్ట్ చేసింది. ఆ ఫొటోలను తన అభిమానులతో ఇన్ స్టా ద్వారా పంచుకుంది. పిక్స్ చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

తాజాగా శ్రీముఖి ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. అదిరిపోయే డ్రెస్ లో స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఇందులో ఊరమాస్ గా ఇచ్చిన స్టిల్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరిన్ని స్టన్నింగ్ ఫొటోలకూ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

బుల్లితెరపై వరుస షోలతో అలరిస్తున్న శ్రీముఖి.. ఇలా సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. స్టన్నింగ్ ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. మరోవైపు వెండితెరపైన నటిగా అలరిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో నటిస్తోంది. 

Latest Videos

click me!