సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న సీతా.. మృణాల్ మత్తు చూపులకు కుర్ర గుండెలు విలవిల!

First Published | Mar 6, 2023, 11:51 AM IST

తొలిచిత్రంతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ భామ.. సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. 
 

బాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నార్త్, సౌత్ లో జోష్ కనబరుస్తోంది. సౌత్ లో మాత్రం ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదు. తొలిచిత్రంతోనే దక్షిణాది ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

గతేడాది విడుదలైన బ్టాక్ బాస్టర్ ఫిల్మ్ ‘సీతారామం’తో సౌత్ ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది మృణాల్ ఠాకూర్. అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ప్రిన్స్ నూర్జహాన్, సీత పాత్రల్లో జీవించి ఆడియెన్స్ మదిలో నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ క్రేజ్ అంతా ఇంతా లేదు. 


దీంతో మృణాల్ ఠాకూర్ వరుస ఆఫర్లను అందుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో నేచురల్ స్టార్ నాని (Nani) సరసన నటించే చాన్స్ దక్కించుకుంది. Nani30లో  నేచురల్ స్టార్ కు జోడీగా మృణాల్ ఠాకూర్ ఆడిపాడనుంది. దీంతో తెలుగు ఆడియెన్స్ తో పాటు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

ఇదిలా ఉంటే.. మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తున్నారు. తన అభిమానులను ఆకట్టుకునేందుకు బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ వస్తున్నారు. మరోవైపు అదిరిపోయే ఫొటోషూట్లతోనూ నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిసిపిస్తోంది. ఈ క్రమంలో కొన్ని బ్యూటీఫుల్ పిక్స్ ను పంచుకుంది. 
 

తాజాగా మృణాల్ ఠాకూర్ ‘గుడ్ హెయిర్ డే’ సందర్భంగా బ్యూటీఫుల్ లుక్ లో ఫొటోషూట్ చేసింది. గ్రీన్ చుడీదార్ లో మెరిసిపోతోంది. అందమైన కురులతో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు అద్దం ముందు నిలువెత్తు అందాలనూ ప్రదర్శించింది.
 

సంప్రదాయ దుస్తుల్లో  మృణాల్ ఠాకూర్  మెరిసిపోతుండటంతో అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులు, మత్తు కళ్లతో గుచ్చే చూపులకు కుర్ర గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ ను ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!