విదేశాల్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న శ్రీముఖి... బర్త్ డే పేరుతో ట్రిప్ అలా ప్లాన్ చేసింది!

Published : May 17, 2023, 04:43 PM IST

యంగ్ యాంకర్ శ్రీముఖి ఇటీవల థాయిలాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ తన సరదాలకు సంబంధించిన ఫోటోలు ఆమె షేర్ చేస్తున్నారు   

PREV
17
విదేశాల్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న శ్రీముఖి... బర్త్ డే పేరుతో ట్రిప్ అలా ప్లాన్ చేసింది!
Sreemukhi

మే 10న శ్రీముఖి బర్త్ డే. ఈ వేడుక కోసం బంధు మిత్రులతో థాయిలాండ్ వెళ్లారు. దాదాపు వారం రోజులు శ్రీముఖి సాగర దేశంలో సేద తీరారు. విందులు, విహారాల్లో పాల్గొన్నారు. ఘనంగా బర్త్ డే పార్టీ జరుపుకుంటుంది.

27
Sreemukhi

ఫుకెట్ నగరంలో గల ప్రఖ్యాత జూ ను శ్రీముఖి సందర్శించారు. జూ ముందు డిఫరెంట్ ఫోజుల్లో ఫోటోలు దిగారు. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. జన్మదిన వేడుకల సంగతి ఎలా ఉన్నా థాయిలాండ్ శ్రీముఖికి బాగా నచ్చేసింది. అక్కడ రోజుల తరబడి ఎంజాయ్ చేస్తున్నారు.

37
Sreemukhi

చేతినిండా షోలతో బిజీగా ఉంటున్న శ్రీముఖి విదేశాల్లో అలా సేద తీరారు. టాప్ యాంకర్ గా అవతరించిన శ్రీముఖి రెండు చేతులా సంపాదిస్తుంది. శ్రీముఖి సంపాదన కోట్లకు చేరినట్టు సమాచారం. హైదరాబాద్ లో ఓ లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు.  వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది. కాబట్టి విహారాలకు లక్షల్లో ఖర్చు చేసినా తప్పేం లేదు. 
 

47
Sreemukhi

పటాస్ షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ కొంత మేర సక్సెస్ అయిన నేపథ్యంలో శ్రీముఖికి మెల్లగా ఆఫర్స్ క్యూ కట్టాయి.బిగ్ బాస్  సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్నారు. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. 
 

57
Sreemukhi

స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. 
 

67
Sreemukhi

యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. . అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.

77
Sreemukhi

శ్రీముఖి స్టార్ హీరోయిన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ లో  శ్రీముఖి నటిస్తున్నారట. ఈ చిత్రంలో  మెగాస్టార్ తో ఆమెకు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయనే ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. 
 

click me!

Recommended Stories