యాంకర్ శ్రీముఖి తాను గతంలో రిజెక్ట్ చేసిన షో గురించి మాట్లాడారు. ఆ సమయంలో హీరోయిన్ గా ఛాన్సుల కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో ఆ షోని వదులుకున్నారట. ఇంతకీ ఆ షోలో ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.
టాలీవుడ్ లో బ్యూటిఫుల్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. వరుస షోలతో శ్రీముఖి దూసుకుపోతున్నారు. నటిగా కూడా అప్పుడప్పుడూ రాణిస్తున్నారు. శ్రీముఖికి నటిగా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. హీరోయిన్ గా రాణించాలి అని కెరీర్ బిగినింగ్ లో శ్రీముఖి భావించేవారు. కానీ ఆఫర్స్ రాలేదు. ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ గా , యాంకర్ గా వచ్చిన ఛాన్సుల గురించి శ్రీముఖి ఆసక్తికర వ్యాఖలు చేశారు.
25
జబర్దస్త్ కి యాంకర్ గా ఆఫర్
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు జబర్దస్త్ షోకి యాంకర్ గా మొట్టమొదట ఆఫర్ వచ్చింది తనకే అని శ్రీముఖి పేర్కొంది. మల్లెమాల సంస్థ ద్వారానే నేను ఇండస్ట్రీకి వచ్చాను. వాళ్లకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. జబర్దస్త్ షో ప్రారంభం అవుతుంది అనగా యాంకరింగ్ కోసం ముందు నాకే కాల్ చేశారు.
35
క్రేజీ డైరెక్టర్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్
అదే సమయంలో నాకు వంశీ గారి దర్శకత్వంలో 'తను మొన్నే వెళ్ళిపోయింది' అనే చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. వంశీ గారి సినిమా అంటే ఏ నటి కూడా మిస్ చేసుకోదు. ఆ మూవీలో రంగంలో విలన్ గా నటించిన అజ్మల్ అమీర్ హీరో. దీనితో ఈ ఛాన్స్ ఎట్టిపరిస్థితిలో వదులుకోకూడదు అని అనుకున్నా. ఇంతలో జబర్దస్త్ నుంచి కాల్ వచ్చింది.
కామెడీ షో కాబట్టి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, షోలో నాపై సెటైర్లు వేస్తారేమో ఇలాంటి అనుమానాలు ఉండేవి. దీనితో నేను చేయలేను అని చెప్పా. ఇంతలో వంశీ దర్శకత్వంలో సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. చివరికి ఆ సినిమాలో నన్ను తప్పించి నికిత నారాయణ్ ని తీసుకున్నారు. అనసూయ బిగినింగ్ లోనే జబర్దస్త్ నుంచి కొన్ని కారణాల వల్ల తప్పుకుంది. దీనితో మళ్ళీ నన్ను అడుక్కున్నారు.
55
చాలా బాధ పడ్డాను
అప్పుడు కూడా నాకు జబర్దస్త్ కి వెళ్లడం ఇష్టం లేదు. కనీసం మూడు ఎపిసోడ్స్ అయినా చేయండి ఆ తర్వాత వేరే యాంకర్ ని తీసుకుంటాం అని అడిగారు. స్టేజీపై నాపై సెటైర్లు వేస్తే అనసూయలాగా నేను తీసుకోలేను. ఏడ్చేస్తాను అని అనుకున్నా. అందుకే నో చెప్పా. దీనితో ఆ ఛాన్స్ రష్మీ గౌతమ్ కి వెళ్ళింది. ఏడాది లోపు జబర్దస్త్ చాలా పాపులర్ షో అయిపోయింది. అప్పుడు అనిపించింది. అరె.. జబర్దస్త్ చేసి ఉంటే బావుండేది కదా.. ఛాన్స్ మిస్ చేసుకున్నానే అని బాధపడినట్లు అనసూయ పేర్కొంది.