Ram Charan Peddi: తండ్రి సినిమాని కూడా బీట్ చేసి భారీ హిట్ దిశగా పెద్ది, అక్కడ మాత్రం డిజాస్టర్ ?

Published : Jun 14, 2026, 03:40 PM IST

2026లో టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా పెద్ది చిత్రం రికార్డ్ సృష్టించింది. చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు వసూళ్ళని అధికమించి ఈ ఘనత సాధించింది. అయితే ఒక్క చోట మాత్రం పెద్ది చిత్రానికి నిరాశ తప్పడం లేదు. 

PREV
15
పెద్ది చిత్రానికి క్రేజీ రెస్పాన్స్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రాంచరణ్ పడ్డ కష్టానికి, అతడి నటనకు పెద్ది చిత్రంతో తగిన గుర్తింపు లభించింది. రాంచరణ్ ఈ చిత్రంలో నట విశ్వరూపం ప్రదర్శించినట్లు ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. 10 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 378 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

25
తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్

ట్రేడ్ వర్గాలు కూడా పెద్ది చిత్రం 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు కంఫర్మ్ చేశాయి. బాక్సాఫీస్ వద్ద పెద్ది ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందో దీనిని బట్టే అర్థం అవుతోంది. పెద్ది చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తాజాగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని హిట్ లిస్ట్ లో చేరిపోయింది. పెద్ది చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 135 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆ మొత్తాన్ని పెద్ది వసూలు చేసేసింది. ఇక రానున్న రోజుల్లో వచ్చే కలెక్షన్స్ మొత్తం లాభాలే అని చెప్పాలి.

35
2026 హైయెస్ట్ గ్రాసర్ గా పెద్ది

పెద్ది మరో రికార్డ్ కూడా అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్ గా రికార్డ్ సాధించింది. ఈ మూవీ 300 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు చిరంజీవి తనయుడు రాంచరణ్ తన పెద్ది చిత్రంతో తండ్రి రికార్డుని బ్రేక్ చేశారు. ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్ గా తాజాగా పెద్ది రికార్డ్ సాధించింది.

45
అక్కడ మాత్రం ఫ్లాప్ ?

పెద్ది మూవీ ఇంతటి భారీ విజయం సాధించినప్పటికీ ఒక్కచోటు షాక్ తప్పలేదు. ఓవర్సీస్ లో మాత్రం పెద్ది చిత్రానికి నష్టాలు తప్పేలా లేవు. ఇప్పటి వారకు పెద్ది చిత్రం ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు రాబట్టింది. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మాత్రం 5 మిలియన్ డాలర్ల పైనే ఉందని అంటున్నారు. కానీ అక్కడ వసూళ్లు ఆశాజనకంగా లేవు.

55
అదిరిపోతున్న వీకెండ్ కలెక్షన్స్

దీనితో పెద్ది చిత్రం ఓవర్సీస్ లో ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయినట్లే అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. డొమెస్టిక్ మార్కెట్ లో మాత్రం సాలిడ్ రన్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా వీకెండ్స్ లో పెద్ది వసూళ్లు అదిరిపోతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories