ఎలాగైనా హీరోయిన్ అయ్యి.. వెండితెరపై వెలుగు వెలగాలి అని ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ.. కెరీర్ బిగినింగ్ లో హీరోల కు చెల్లెలు పాత్రల్లో కనిపించింది. అవకాశాలు పెద్దగా రాకపోవడంతో.. బుల్లితెరపై యాంకర్ గా సెటిల్ అయ్యింది. జులాయ్, నేను శైలజ, మాస్ట్రో లాంటి సినిమాల్లో మెరిసింది బ్యూటీ.