యంగ్ హీరోతో నాలుగేళ్లుగా ప్రేమాయణం, పెళ్ళికి ముహూర్తం ఫిక్స్... శ్రీముఖి సైలెంట్ గా ఇంత తతంగం నడిపిందా?

First Published | Apr 1, 2024, 3:25 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి గత నాలుగేళ్లుగా ఓ హీరోతో రహస్యంగా ప్రేమాయణం సాగిస్తుందట. ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం... 
 

Sreemukhi

శ్రీముఖి యాంకర్ గా ఫుల్ ఫార్మ్ లో ఉంది. స్టార్ మా లో సందడి మొత్తం ఆమెదే. ఒకటి నాలుగు షోలు చేస్తుంది. అలాగే ఆహా వంటి ఓటీటీ యాప్స్ లో కూడా కొని షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. అలాగే నటిగా సత్తా చాటుతుంది. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తుంది. 

పటాస్ షోతో వెలుగులోకి వచ్చిన శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి వెళ్ళింది. రాహుల్ సిప్లిగంజ్-శ్రీముఖి టైటిల్ పోరులో నిలిచారు. తృటిలో టైటిల్ కోల్పోయిన శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. అయితే రెమ్యూనరేషన్ రూపంలో భారీగా ఆర్జించినట్లు సమాచారం. 


బిగ్ బాస్ షోకి వెళ్లడం శ్రీముఖికి కలిసొచ్చింది. ఈ షో తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. యాంకర్ గా బిజీ అయ్యింది. క్రేజీ అంకుల్ టైటిల్ తో విడుదలైన చిత్రంలో శ్రీముఖి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. శ్రీముఖికి ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఆచితూచి ఎంచుకుంటుందట. 

Sreemukhi

మరోవైపు శ్రీముఖి పెళ్లి వార్తలు తరచుగా సోషల్ ఇండియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ యంగ్ హీరోతో ఆమె డేటింగ్ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గత నాలుగేళ్లుగా టాలీవుడ్ తో శ్రీముఖి రిలేషన్ లో ఉందట. వీరు రహస్యంగా ప్రేమించుకుంటున్నారట. 

Sreemukhi

శ్రీముఖి ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు కూడా తెలుసట. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపిన నేపథ్యంలో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ ఏడాది చివర్లో సదరు హీరోతో శ్రీముఖి వివాహం అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది. 


గతంలో శ్రీముఖి యాంకర్ ప్రదీప్ ని వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అవి పుకార్లని శ్రీముఖి కొట్టిపారేసింది. అలాగే హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి అంటూ మరో వార్త హల్చల్ చేసింది. ఈ వార్తలపై శ్రీముఖి మండి పడ్డారు. నాకు పెళ్లి కుదిరితే నేనే స్వయంగా చెబుతాను. ఫేక్ న్యూస్ రాయవద్దని ఆమె ఆవేదన చెందారు... 

Latest Videos

click me!