క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తాజాగా విజయ్ దేవరకొండపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రౌడీ స్టార్ ఎలాంటోడు అనే దానిపై తాజాగా స్పందించింది.
మరాఠి ముద్దుగుమ్మ, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ లో మరింత గుర్తింపు దక్కించుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది.
26
సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రంతో అలరించబోతోంది.
36
‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన నటించింది. ఏప్రిల్ 5న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
46
ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆకట్టుకుంటోంది. ఈక్రమంలో విజయ్ దేవరకొండ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది.
56
విజయ్ దేవరకొండ ‘రౌడీ స్టార్, ఫ్యామిలీ స్టార్’ రెండూ కాదని తేల్చేసింది. విజయ్ సెట్స్ లో కాలా కామ్ గా, కూల్ గా ఉంటారని తెలిపింది. తన సీన్స్ ను చాలా డిసిప్లయిన్ గా చేస్తుంటారని చెప్పింది.
66
చాలా కామ్ గా, రియాలిటీగా, జెన్యూన్ గా ఉంటారని తెలిసింది. విజయ్ దేవరకొండ ఎలాంటి వారో చెప్పాలంటే ‘రౌడీ స్టార్, ఫ్యామిలీ స్టార్’ కు మించిన వ్యక్తి అని తెలిపింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.