యాంకర్‌ సౌమ్య రావు మళ్లీ వచ్చింది.. సంక్రాంతి పండక్కి అదిరిపోయే ట్రీట్‌.. కానీ ట్విస్ట్ పెద్దదే!

Published : Jan 15, 2024, 07:07 AM IST

జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య రావు ఇటీవల షో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై మెరిసింది. సంక్రాంతికి అభిమానులకు పండగని తీసుకొచ్చింది.   

PREV
16
యాంకర్‌ సౌమ్య రావు మళ్లీ వచ్చింది.. సంక్రాంతి పండక్కి అదిరిపోయే ట్రీట్‌.. కానీ ట్విస్ట్ పెద్దదే!
Sowmya Rao

కన్నడ బ్యూటీ సౌమ్య రావు సీరియల్స్‌ లో నటిగా మెప్పించి, అట్నుంచి యాంకర్‌గా మారిపోయింది. `జబర్దస్త్` కామెడీ షోకి యాంకర్‌గా మారి రచ్చ చేసింది.  యాంకర్‌గా మారిన తర్వాత ఆమె లైఫే మారిపోయింది. కెరీర్‌ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ఆమెకి ఊహించని క్రేజ్‌ వచ్చింది.  ఫాలోయింగ్‌ పెరిగింది. అటు సోషల్‌ మీడియాలో, ఇటు `జబర్దస్త్‌` షోలో హంగామా చేసింది. 
 

26

దాదాపు ఏడాదికిపైగానే `జబర్దస్త్` షోకి ఆమె యాంకర్‌గా  చేసింది. ప్రారంభంలో ఆమె కోసం చూసిన ఆడియెన్స్ ఉన్నారు. ఆమె డైలాగులు, పంచ్‌లు  అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హైపర్‌ ఆదితో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇద్దరికి వార్‌లా జరిగింది. ఒకరంటే ఒకరికి పడదనే సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత  కొన్ని రోజులకు హైపర్‌ ఆది షో నుంచి తప్పుకున్నాడు. దానికి సౌమ్య రావునే కారణమనే గుసగుసలు వినిపించాయి. 

36

మొత్తానికి షోని బాగానే నెట్టుకొచ్చింది సౌమ్యరావు. స్లిమ్‌ లుక్‌లో కట్టిపడేస్తూ తన ముద్దుముద్దు మాటలతో ఆకట్టుకుంది. అందంతో కట్టిపడేసింది. కానీ ఇటీవల అనూహ్యంగా షో నుంచి తప్పుకుంది.  ఆమె స్థానంలో బిగ్‌ బాస్‌ సిరిని యాంకర్‌గా తీసుకొచ్చారు. దీంతో సౌమ్య రావు  ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారు.  మళ్లీ ఆమె రావాలని కోరుకున్నారు. కానీ ప్రస్తుతం సిరినే కంటిన్యూ అవుతుంది. మరి  సౌమ్యరావు తప్పుకోవడానికి కారణం ఏంటనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. 
 

46

రేటింగ్‌ రాకపోవడం వల్ల యాంకర్‌ని మార్చినట్టు నిర్వాహకుల నుంచి తెలుస్తున్న మ్యాటర్‌. షోపై చాలా  ప్రయోగాలు చేస్తున్నారని,  రేటింగ్‌ కోసం చేస్తున్న  ఎత్తులే  ఇవనీ తెలుస్తుంది. ఇంకా మార్పులుంటాయి టాక్‌. ఈ నేపథ్యంలో సౌమ్య  రావు మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె ఈ సంక్రాంతి పండక్కి మళ్లీ బుల్లితెరపై మెరవబోతుంది. ఈ ఆదివారమే ఆమె రచ్చ చేయబోతుంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్  ఉంది. 

56

యాంకర్‌ సౌమ్య రావు ఈటీవీలో చేయడం లేదు. `జబర్దస్త్` షో చేయడం లేదు. ఆమె టీవీ ఛానెల్‌ మార్చేసింది. జీ తెలుగులోకి ఎంట్రీ  ఇస్తుంది. సంక్రాంతి పండక్కి చేసిన స్పెషల్‌ షోలో యాంకర్‌గా మెరిసింది. `బావ మరదళ్ల సరదా సంక్రాంతి` పేరుతో ఈ ప్రత్యేకమైన షో చేశారు. ఇది ఈ ఆదివారం ఉదయం ప్రసారం కానుంది. యాంకర్‌ సౌమ్యతోపాటు మరో యాంకర్‌ శ్యామల కూడా  ఇందులో మెరవబోతుంది. 

66
Sowmya Rao

ఇక సౌమ్య రావు మళ్లీ  బుల్లితెరపై సందడి చేయబోతుందని తెలుస్తుంది. కానీ ఆమె ఈటీవీ కాకుండా స్టార్‌ మా, జీ తెలుగు షోస్‌ల మెరిసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ బుట్టబొమ్మ  తెలుగు ఆడియన్స్ ని మళ్లి పలకరించనుందని,  గ్లామర్‌తో ఆకట్టుకోబోతోందని తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories