Amardeep : ‘ఫ్రెండ్ ఆపదలో ఉంటే పార్టీలు చేసుకుంటారా?’.. స్నేహితులపై బిగ్ బాస్ 7 రన్నర్ అమర్ దీప్ ఫైర్!

Published : Jan 14, 2024, 11:10 PM IST

బిగ్ బాస్ తెలుగు 7 రన్నర్ గా నిలిచిన అమర్ దీప్ Amardeep ఇటీవల ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈక్రమంలో తను ఎంతగానో నమ్మిన స్నేహితుల గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.    

PREV
16
Amardeep : ‘ఫ్రెండ్ ఆపదలో ఉంటే పార్టీలు చేసుకుంటారా?’.. స్నేహితులపై బిగ్ బాస్ 7 రన్నర్ అమర్ దీప్ ఫైర్!

బిగ్ బాస్ తెలుగు 7 రన్నర్  అమర్ దీప్ ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ ఏడు గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ తర్వాత ఇటీవల ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన అంశాలపై మాట్లాడుతున్నారు. తాజాగా తన స్నేహితుల గురించి చెప్పారు. 
 

26

ఇటీవల ఇంటర్వ్యూలో అమర్ దీప్ కాస్తా ఎమోషనల్ అయ్యారు. తను ఎంతగానో నమ్మిన స్నేహితులు తనకు ఆపద సమయంలో అండగా, మద్దుతుగా నిలవలేదన్నారు. ఈ సందర్భంగా వారి గురించి మాట్లాడుతూ కాస్తా ఆవేదనకు వ్యక్తం చేశారు. 
 

36

‘మంచి సమయంలో నువ్వు నా బంధం, నువ్వే నా మట్టిగడ్డ, ఉల్లిగడ్డ అనడం కాదు. హార్డ్ టైమ్ లోనే మనతో నిలిచేవారే మన స్నేహితులు. బిగ్ బాస్ హౌజ్ లో మొదటి ఐదు వారాలు నా ఫ్రెండ్స్ సరిగా సపోర్ట్ చేసి ఉంటే బాగుండు. ఫ్రెండ్ భయపడుతుంటే వాళ్లు మాత్రం పార్టీ, టూర్లకు వెళ్తూ కనిపించారు’.
 

46

పైగా నెవెర్ గివప్, బీ స్ట్రాంగ్, నువ్వే విజేత అంటూ చెప్పే కామెంట్లకూ మరింత బాధనిపించింది. హౌజ్ లో అందరూ నన్ను నామినేట్ చేసినప్పుడు రెండ్రోజులు మనిషిని కాలేదన్నారు. అసలు ఎందుకొచ్చానని ఫీలైనట్టు తెలిపారు.’ తనకు ఎంతగానో హార్ట్ కు దగ్గరైన ఫ్రెండ్స్ అలా చేయడం బాగోలేదని చెప్పారు. 
 

56

ఫ్రెండ్స్ సపోర్ట్ చేయలేదని మాట్లాడిన అమర్ దీప్ వాళ్ల పేర్లను మాత్రం రివీల్ చేయలేదు. వారెవరో బిగ్ బాస్ ఆడియెన్స్ కు అర్థమవుతుందంటూ దాటవేశారు. ప్రస్తుతం అమర్ దీప్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

66

ఇక అమర్ దీప్ పాపులర్ రియాలిటీ షో Bigg Boss Telugu 7 టైటిల్ రేసులో బాగా పోరాడాడు. రన్నరప్ గా నిలిచాడు.  టైటిల్ ను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న సంగతి తెలిసందే. శివాజీ Sivaji కి మూడో స్థానంలో నిలిచి టైటిట్ ను దూరం చేసుకున్నారు.  

click me!

Recommended Stories