జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్‌లు ప్రేమలో ఉన్నారని, ఈ ఇద్దరే మ్యారేజ్ చేసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. కానీ దాన్ని బ్రేక్ చేస్తూ షాకిచ్చాడు జబర్దస్త్ కమెడియన్.
యాంకర్ రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ బుల్లితెర జోడీగా రాణించారు. ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. జంట పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇటీవల వీరి దూరంగా ఉంటున్నారు. సుధీర్ సినిమాల్లోకి వెళ్లిపోయాడు. రష్మి `జబర్దస్త్` యాంకర్‌గానే కొనసాగుతుంది. దీంతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తుంది. ఈ రెండు షోస్‌తో ప్రతి వారం అలరిస్తుంది.
27
అయితే ఈ ఇద్దరు ఎప్పటికైనా కలుస్తున్నారని వీరి అభిమానులు ఆశ పడుతున్నారు. అది నిజం కావాలనుకుంటున్నారు. ఈ ఇద్దరికి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సందర్భం ఏదైనా, ప్రోమోలు, వీడియోలు ఏవైనా కింద వీరి అభిమానులు పోస్ట్ లు పెడుతుంటారు. జై సుధీర్, జై సుధీర్, రష్మి అంటూ కామెంట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో పెద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు.
37
photo credit-ETV Balagam Promo
ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మి, సుడిగాలి సుధీర్ ఎవరికి వాళ్లు దూరంగా ఉంటున్నారు. కానీ ఏదైనా అకేషనల్‌గా కలుస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఫ్యాన్స్ కోరిక మాత్రం తీరనిదిగానే మిగిలిపోయే అవకాశం ఉంది. సుధీర్ తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని, సినిమాలతో బిజీగా ఉన్నానని, పెళ్లి ఆలోచన లేదని తెలిపాడు. రష్మి.. పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఆ మధ్య పెళ్లి కబురు చెబుతానని ఊరించింది ఉసూరుమనిపించింది. దీంతో మళ్లీ ఆ టాపిక్ ఎత్తడం లేదు.
47
ఈ నేపథ్యంలో ఇక వీళ్ల పెళ్లి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఇద్దరు పెళ్లి చేసుకునే ఆలోచన చేయడం లేదు. దీంతో జబర్దస్త్ కమెడియన్ నూకరాజు వీళ్లపై బాంబ్ పేల్చాడు. ఏకంగా స్కిట్ రూపంలో అసలు విషయాన్ని వెల్లడించాడు. ఇందులో తాగుబోతు రమేష్‌తోపాటు మరో సీనియర్ లేడీ ఆర్టిస్ట్ తో కలిసి ఈ స్కిట్‌ని ప్రదర్శించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్కిట్‌ని ప్రదర్శించడం విశేషం.
57
ఇందులో తాగుబోతు రమేష్ ముసలివాడు అవుతాడు. ఆయనకు కొడుకులు, కూతుళ్లు, మనవరాళ్లతో ఉంటాడు. దగ్గుతూ ఊగుతూ కనిపించాడు. ఈ క్రమంలో మరో లేడీ ఆర్టిస్ట్ వచ్చింది. రాగానే నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి అని ఆవిడ అడగ్గా, ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి అంటూ నూకరాజు చెప్పాడు. దీంతో అలా వంకరగా ఆమె తాగుబోతు రమేష్‌ని చూసింది.
67
Sudigali Sudheer
ఇద్దరు స్టేజ్‌పైకి వచ్చి ఒకరినొకరు పట్టుకుని ప్రేమగా చూసుకుంటున్నారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. దీంతో నూకరాజు రెచ్చిపోయాడు. తాగు బోతు రమేష్‌ని సుధీర్‌గా, ఆ సీనియర్ ఆర్టిస్ట్ ని రష్మిగా చేసి, సుధీర్ రష్మీ అంటూ ముద్ర వేశాడు. దెబ్బకి రష్మికి మైండ్ బ్లాక్ అయ్యింది. బిత్తరపోయి చూసింది.
77
కానీ దీని ద్వారా ఓ విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు నూకరాజు.. ముసలోళ్లు అయినా ఈ ఇద్దరుపెళ్లి చేసుకోరని, ఇలానే కొన్నేళ్ల తర్వాత కలుసుకోవాల్సి వస్తుందని చెప్పకనే చెప్పాడు. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో ట్రెండ్ అవుతుంది. వచ్చే ఆదివారం ఇది ప్రసారం కానుంది.