జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది. ప్రస్తుతం రష్మీ జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకరింగ్ చేస్తోంది. రష్మీ సినిమాలకంటే బుల్లితెరపైనే ఎక్కువ బిజీగా ఉంటోంది.
రష్మీ తెలుగు అమ్మాయి కాదు. వైజాగ్ లో చదువుకోవడం వల్ల కొంచెం తెలుగు నేర్చుకుంది. అయితే ఆమె యాంకరింగ్ చేసే తప్పుడు తెలుగు సరిగా మాట్లాడలేకపోవడం వల్ల రష్మీ ఎదుర్కొనే ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు కాస్త మేనేజ్ చేస్తోంది కానీ బిగినింగ్ లో తనని దారుణంగా తిట్టారట. జబర్దస్త్ లో ఆఫర్ ఎలా వచ్చింది..ప్రారంభంలో తనకి ఎదురైన సవాళ్లు ఏంటి అనే విషయాలని రష్మీ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.
రష్మీ డైరెక్ట్ గా యాంకర్ అయిపోలేదు. మొదట ఒక చిత్రం చేసింది. ఆ మూవీ వర్కౌట్ కాకపోవడంతో ఇంటికి వెళ్లిపోయిందట. ఆ తర్వాత టివి సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి. యువ, లవ్ అనే సీరియల్స్ చేసింది. తనకి టీవీ రంగం చాలా కంఫర్టబుల్ గా అనిపించిందట. సీరియల్స్ లో పాపులర్ కావడంతో ప్రస్థానం చిత్రంలో ఛాన్స్ వచ్చింది అని రష్మీ గౌతమ్ తెలిపింది.
కానీ సినిమా రంగం తనకి అంత కంఫర్టబుల్ గా అనిపించలేదట. అదే సమయంలో జబర్దస్త్ నుంచి ఆమెకి కాల్ వచ్చిందట. ఇలా ఒక తెలుగు కామెడీ షో చేస్తున్నాము.. దానికి హోస్ట్ గా చేయాలి అని అడిగారు. నాకు తెలుగు సరిగా రాదని రష్మీ నిజాయతీగా చెప్పింది. పర్వాలేదు.. మేము మ్యానేజ్ చేసుకుంటాం అని భరోసా ఇచ్చారు.
మనీ కూడా బాగా ఆఫర్ చేశారు. దీనితో ఒకే చెప్పాను. అప్పటికే జబర్దస్త్ మొదలై 13 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. తొలి 13 ఎపిసోడ్స్ ని అనసూయ చేసింది. నాకు జబర్దస్త్ కి వెళ్లే వరకు అనసూయ అనే యాంకర్ ఉందని కానీ, ఆమె ఫ్యాన్ బేస్ గురించి కానీ అసలు తెలియదు.
13 వ ఎపిసోడ్ తర్వాత అనసూయ మానేసింది. 14 వ ఎపిసోడ్ నుంచి నేను స్టార్ట్ చేసాను. ఆ సమయంలో యూట్యూబ్ లో సోషల్ మీడియాలో నన్ను దారుణంగా తిట్టారు. అనసూయ తో పోల్చుతూ అవమానించారు. ఆడియన్స్ అన్ను రిసీవ్ చేసుకోవడం లేదు, యాక్సప్ట్ చేయడం లేదు.
తెలుగు సరిగా రాదంటూ అవమానకరంగా కామెంట్స్ పెట్టారు. ప్రతి విషయంలో అనసూయతో పోలిక పెట్టారు. దీనితో జబర్దస్త్ లో కొనసాగలేను అనిపించింది. మేనేజ్మెంట్ కి చెప్పా. పర్వాలేదు అమ్మా.. కొత్తలో ఇలాగే ఉంటుంది అని ధైర్యం చెప్పారు. ఆ ధైర్యంతోనే ఇలా జబర్దస్త్ లో గుర్తింపు పొందినట్లు రష్మీ తెలిపింది.