ఊరు పేరు భైరవకోన ప్రీమియర్ రివ్యూ: సందీప్ కిషన్ ఈజ్ బ్యాక్, కాకపోతే అదే మైనస్, హైలెట్ ఏంటంటే?

First Published | Feb 15, 2024, 9:21 AM IST

సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన. ఈసారి ఆయన ఫాంటసీ సస్పెన్సు థ్రిల్లర్ ఎంచుకున్నాడు. ఫిబ్రవరి 16న మూవీ విడుదల కానుంది. అయితే ప్రీమియర్స్ ఒకరోజు ముందే ప్రదర్శించారు. దీంతో టాక్ బయటకు వచ్చింది. 
 

Ooru peru Bhairavakona review

హీరో సందీప్ కిషన్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరు. అయితే ఆయనకు హిట్స్ పడటం లేదు. సినిమా సినిమాకు విపరీతంగా కష్టపడుతున్న సందీప్ కిషన్ డిఫరెంట్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. అయితే ఫలితం దక్కడం లేదు. ఈసారి ఆయన ఫాంటసీ సస్పెన్సు థ్రిల్లర్ ఎంచుకున్నారు. 

Ooru peru Bhairavakona review

ఎక్కడికిపోతావు చిన్నవాడా మూవీతో టాలీవుడ్ ని ఆకర్షించిన దర్శకుడు వి ఐ ఆనంద్ ఊరు పేరు భైరవకోన చిత్రం తెరకెక్కించాడు. సందీప్ కిషన్ సరికొత్త పాత్ర చేశాడు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. ఊరు పేరు భైరవకోన చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. 


Ooru peru Bhairavakona review

ఇక ఊరు పేరు భైరవకోన చిత్రం చూసిన ఆడియన్స్ తన స్పందన తెలియజేస్తున్నారు. ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాగుందని అంటున్నారు. దర్శకుడు చాలా ఎంగేజింగ్ గా మొదటి భాగం నడిపించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. 

Ooru peru Bhairavakona review

సందీప్ కిషన్ స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మన్స్ బాగున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో బెస్ట్ అంటున్నారు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. అక్కడక్కడా వచ్చే ట్విస్ట్స్ అలరిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. 
 

Ooru peru Bhairavakona review


శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు ప్లస్. పాటలు, బీజీఎమ్ బాగా కుదిరాయి. నిజమే నే చెబుతున్నా... సాంగ్ యూత్ కి విపరీతంగా నచ్చేసింది. ఇవి సినిమాకు ప్లస్ పాయింట్స్. 

Ooru peru Bhairavakona review

అయితే నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్ యావరేజ్ గా ఉందని అంటున్నారు. దర్శకుడు ఇంకొంచెం బెటర్ గా తీర్చిదిద్దాల్సింది. రెండవ భాగం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. మొత్తంగా సినిమా చూడొచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 

Latest Videos

click me!