స్లీవ్ లెస్ జాకెట్ లో విశాలమైన వీపు చూపిస్తూ రచ్చ లేపిన హాట్ యాంకర్ రష్మీ... డ్రెస్ ఏదైనా హాట్నెస్ ఆమె సొంతం

First Published | Aug 28, 2021, 9:12 AM IST

బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ అందాలు పెద్ద ఉపశమనం. గ్లామర్ షో ఇష్టపడే ప్రేక్షకులకు రష్మీ లాంటి యాంకర్స్ ఏడాదిలో వయాసిస్ లా దొరికారు. 
 


టెలివిజన్ కంటెంట్ హద్దులు చెరిగిపోతున్న ఈ రోజుల్లో, ఆ సాంప్రదాయానికి నాంది పలికారు రష్మీ. అరంగేట్రంతోనే పొట్టి బట్టలతో స్కిన్ షోకి తెరలేపి, సరికొత్త అనుభూతిని ఆడియన్స్ కి పంచారు. 
 

అడల్ట్ కామెడీ షోగా ఒకప్పుడు విమర్శల పాలైన జబర్దస్త్ షోలో.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి తోడు డబుల్ హాట్ రష్మీ గ్లామర్.. షోకి సూపర్ పాపులారిటీ తెచ్చింది. కంటెంట్ విషయంలో విమర్శలు ఎక్కువ కావడంతో బూతు జోకులు డోసు తగ్గించారు. అయితే యాంకర్స్ గ్లామర్ షోకి మాత్రం అడ్డు కట్ట వేయలేదు.


ఇక ఆ షో యాంకర్ రష్మీ కెరీర్ ని మార్చి వేసింది. చిన్న చిన్న వేషాలు వేస్తూ.. ఇక ఇంటికే అంటుకుంటున్న తరుణంలో జబర్దస్త్ అవకాశం ఆమెకు దక్కింది. ఆ షో ద్వారా సూపర్ పాప్యులారిటీ ఆమె దక్కించుకున్నారు.

హీరోయిన్ కావాలన్న రష్మీ కల యాంకర్ గా మారాక నెరవేరడం మిరాకిల్ అని చెప్పాలి. హాట్ యాంకర్ గా వచ్చిన ఇమేజ్ ఆమెకు వరుస వెండితెర ఆఫర్స్ తెచ్చిపెట్టింది. ఇప్పటికే పలు చిత్రాలలో రష్మీ హీరోయిన్ గా నటించారు. 
 

అయితే యాంకర్ గా సూపర్ సక్సెస్ అయినప్పటికీ, హీరోయిన్ గా రష్మీకి బ్రేక్ రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలలో ఒక్కటి కూడా క్లీన్ హిట్ దక్కించుకోలేదు. దీనితో ఆమెకు ఆఫర్స్ తగ్గాయనే చెప్పాలి. ప్రస్తుతం రష్మీ హీరోయిన్ గా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల కావాల్సి ఉంది. 
 


యాంకర్ గా మాత్రం రష్మీ ఫుల్ బిజీగా ఉన్నారు. అత్యధిక రేటింగ్ కలిగిన ఢీ, జబర్దస్త్ షోలతో పాటు పలు కార్యక్రమాలలో ఆమె సందడి చేస్తున్నారు. 

ఇక ఎప్పటిలాగే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ కాక రేపుతోంది అమ్మడు. తాజాగా వైలెట్ కలర్ శారీ, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి గ్లామర్ షోకి తెరలేపింది.

బ్యాక్ లెస్ జాకెట్ లో విశాలమైన వీపు చూపుతూ హొయలు పోయింది. రష్మీ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ గా మారగా.. శారీలో కూడా ఇంత హాట్ గా కనిపిస్తారా అంటూ షాక్ అవుతున్నారు. 

Latest Videos

click me!