ఎన్టీఆర్ విదేశాల నుంచి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్స్యూల్స్ కారుని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మోడల్ కారుని కొన్న తొలి ఇండియన్ గా ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించాడు. దీనితో ఎన్టీఆర్ కొన్న కారు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కారు ఖరీదు 3.5 కోట్ల వరకు ఉంటుంది. ఎన్టీఆర్ ఈ కొత్త కారు కొన్న తర్వాత సెలెబ్రిటీల కాస్ట్లీ కార్ల విషయంలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.