రష్మీ గౌతమ్ ఒక దశలో వరుస చిత్రాలు చేసింది. జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించిన రష్మీకి హీరోయిన్ అవకాశాలు వచ్చాయి. అయితే రష్మీ నటించిన చిత్రాల్లో ఒకటి కూడా విజయం సాధించలేదు. దాంతో రష్మీకి అవకాశాలు తగ్గాయి.
rashmi Instagram
హీరోయిన్ గా రష్మీ చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. భోళా శంకర్ మూవీలో తళుక్కున మెరిసింది. కాగా రష్మీ గౌతమ్ ఒక క్రేజీ ఆఫర్ వదులుకుందట. అది కూడా మహేష్ బాబు మూవీలో. సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారంలో రష్మీకి గెస్ట్ అప్పీరెన్స్ ఆఫర్ వచ్చిందట.
మహేష్ బాబు-త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రంలోని ''కుర్చీ మడతపెట్టి'' సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఊపేసింది. మహేష్-శ్రీలీల ఎనర్జిటిక్ స్టెప్స్ ఫ్యాన్స్ లో జోష్ నింపాయి.
కుర్చీ మడతపెట్టి సాంగ్ లో నటి పూర్ణ కూడా కాలు కదిపింది. సాంగ్ ఆమెతోనే ప్రారంభం అవుతుంది. కుర్చీ మడతపెట్టి సాంగ్ పూర్తి అయ్యే వరకు పూర్ణ కనిపిస్తారు. పూర్ణ చేసిన ఆ గెస్ట్ అప్పియరెన్స్ కి మొదట రష్మీ గౌతమ్ ని అనుకున్నారట.
Rashmi Gautam
మహేష్ బాబు సినిమా అయినప్పటికీ అలాంటి గెస్ట్ రోల్ చేయనని రష్మీ గౌతమ్ సున్నితంగా తిరస్కరించారట. రష్మీ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ఆ ఆఫర్ పూర్ణ వద్దకు వెళ్లిందనేది కథనాల సారాంశం. ఈ రూమర్స్ పై ట్విట్టర్ వేదికగా రష్మీ గౌతమ్ స్పందించారు. ఆమె ఒకింత ఆవేదన చెందారు.
కుర్చీ మడతపెట్టి సాంగ్ చేయాలని నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేను రిజెక్ట్ చేశానన్న వార్తల్లో నిజం లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ ని ఎంకరేజ్ చేయకండి. నాపై నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది. ఆ సాంగ్ పూర్ణ గొప్పగా చేశారు. ఆమెలా మరొకరు చేయలేరు, అని రష్మీ అన్నది.
తప్పుడు ప్రచారం వలన తన కెరీర్ నాశనం అవుతుందని రష్మీ పరోక్షంగా ఆవేదన చెందారు. ఇక బుల్లితెర పై రష్మీ గౌతమ్ హవా కొనసాగుతుంది. ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తోంది.
మరోవైపు రష్మీ పెళ్లి మాట ఎత్తడం లేదు. ఇప్పటికే 35 ఏళ్ళు దాటేశాయి. సుడిగాలి సుధీర్ ని రష్మీ గౌతమ్ ప్రేమిస్తున్నారనే పుకార్లు ఉన్నాయి. అయితే మేము మంచి స్నేహితులం మాత్రమే అని పలుమార్లు పుకార్లను ఖండించారు. అటు సుధీర్ కూడా పెళ్లి చేసుకోవడం లేదు.