లవ్ స్టోరీలో పచ్చిగా బూతులు, లిప్ కిస్సులు, బెడ్ సీన్లు ఉండాల్సిందే..లేదంటే ప్రభాస్ లాగా డిజాస్టర్ తప్పదు

First Published | Feb 14, 2024, 10:29 AM IST

నేడు ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు. ప్రపంచం మొత్తం లవర్స్ వాలంటైన్స్ డేని జరుపుకుంటున్నారు. ఘాడంగా ప్రేమలో మునిగితేలే జంటలు మంచి లవ్ స్టోరీ చిత్రం ఉంటే థియేటర్స్ కి వెళ్లడం కామన్. కానీ ప్రేమ కథా చిత్రాల్లో ప్రస్తుతం స్పష్టంగా ట్రెండు మారింది అనే చెప్పొచ్చు.

నేడు ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు. ప్రపంచం మొత్తం లవర్స్ వాలంటైన్స్ డేని జరుపుకుంటున్నారు. ఘాడంగా ప్రేమలో మునిగితేలే జంటలు మంచి లవ్ స్టోరీ చిత్రం ఉంటే థియేటర్స్ కి వెళ్లడం కామన్. కానీ ప్రేమ కథా చిత్రాల్లో ప్రస్తుతం స్పష్టంగా ట్రెండు మారింది అనే చెప్పొచ్చు. ఒకప్పుడు ప్రేమ కథ అంటే హీరో విధిని సైతం ఎదిరించి తన ప్రేమని గెలుచుకుంటాడు. ప్రియుడి కోసం ప్రాణ త్యాగానికి కూడా ప్రియురాలు వెనుకాడేది కాదు. ప్రేమ కథలు ఇలా ఉండేవి. కానీ లవ్ స్టోరీ చిత్రాలు కంప్లీట్ బోల్డ్ గా మారిపోయాయి. 

లవ్ స్టోరీతో సినిమా వస్తుంటే అందులో కొన్ని అంశాలు తప్పనిసరిగా మారిపోయాయి. హీరో హీరోయిన్ల మధ్య లిప్ కిస్సులు సర్వ సాధారణం అయిపోయాయి. ముద్దు సీన్లు లేనిదే వెండితెరపై రొమాన్స్ పండడం లేదు. అంతటితో ఆగడం లేదు.. ప్రేమని ఇంకా ఘాటుగా చూపించేందుకు దర్శకులు బెడ్ సీన్లు, శృంగార సన్నివేశాలని కూడా పెట్టేస్తున్నారు. 


అయితే కొన్ని చిత్రాల్లో రొమాన్స్ అనేది అందంగా ఉంటుంది. ఉదాహరణకు ఉప్పెన చిత్రంలో దర్శకుడు బిచ్చిబాబు రొమాన్స్ ని చాలా అందంగా చూపించారు. కానీ మరికొన్ని చిత్రాల్లో వల్గారిటీ ఎక్కువైపోయింది. ఈ ట్రెండు ఇటీవల అర్జున్ రెడ్డి చిత్రం నుంచే మొదలైపోయింది అని చెప్పొచ్చు. 

రొమాన్స్ డోస్ సరిపోకపోతే బూతులు కూడా పెట్టేస్తున్నారు. గతంలో ప్రేమ కథలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పటి లవ్ స్టోరీలని ఫ్యామిలీతో కలసి చూడటం కష్టంగా మారిపోయింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీలు కూడా గతంలో వచ్చాయి. కానీ ఇప్పుడు వస్తున్న ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అయిన బేబీ ఆ తరహా చిత్రమే. బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాలకే యువత జై కొడుతున్నారు. 

అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100, బేబీ , బబుల్ గమ్ లాంటి చిత్రాలు బోల్డ్ కంటెంట్ తోనే హిట్ అయ్యాయి. ఈ చిత్రాల్లో ప్రేమ కంటే రొమాన్స్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే క్లీన్ లవ్ స్టోరీలు హిట్ కావడం లేదా అంటే.. హిట్ అవుతున్నాయి.. సీతా రామం లాగా రేర్ అన్నమాట. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు రాధాకృష్ణ పాత స్టైల్ లో ట్రై చేసిన రాధే శ్యామ్ పరిస్థితి ఏమైందో చూశాం. ప్రియురాలి కోసం విధిని ఎదిరించిన ప్రేమికుడి కథగా చక్కగా తెరకెక్కించారు. కానీ ఈ చిత్రం ఆడియన్స్ ని మెప్పించడంలో పూర్తిగా విఫలం అయింది. 

లవ్ స్టోరీ మూవీ అంటే కేవలం లవర్స్ మాత్రమే కలిసి చూసే మూవీస్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఓటిటిలో కూడా కొన్ని ప్రేమ కథా చిత్రాలు సక్సెస్ అవుతున్నాయి. గుడ్ నైట్ చిత్రంలో భర్తపై భార్య ప్రేమని ఎంతో అద్భుతంగా చూపించారు. ఇలాంటి చిత్రాలు థియేటర్స్ లో సక్సెస్ అవుతాయా అంటే అనుమానమే. 

క్రమంగా ప్రేమ కథా చిత్రాలకు టాలీవుడ్ లో నిర్వచనం మారిపోతోంది అని చెప్పొచ్చు. పడిపడి లేచే మనసు, విరాట పర్వం లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీలు వర్కౌట్ కావడం లేదు. దీనితో ప్రేమకథలు చిత్రించే దర్శకులు లిప్ కిస్సులు, రొమాన్స్ నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. 

Latest Videos

click me!