Published : Sep 12, 2023, 12:27 PM ISTUpdated : Sep 12, 2023, 12:33 PM IST
ప్రజెంట్ సనాతన ధర్మ హాట్ పొలిటికల్ టాపిక్. హీరో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణమయ్యాయి. స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ మద్దతు తెలుపగా ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది...
సనాతన ధర్మ (Sanatana Dharma)దోమ వంటిది. దోమలు మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర రోగాలు ఎలా వ్యాప్తి చేస్తాయో... అలాగే సనాతన ధర్మ సమాజంలో అనారోగ్యపూరిత వాతావరణం సృష్టిస్తుంది. సామాజిక న్యాయానికి సనాతన ధర్మ వ్యతిరేకం. దోమల వలె సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని హీరో ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపాయి.
26
Udhayanidhi Stalin Statement
ఉదయనిధి (Udhayanidhi Stalin)కామెంట్స్ ని ఓ వర్గం స్వాగతించగా... హిందూ వర్గాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ముఖ్యంగా బీజేపీ శ్రేణులు ఉదయనిధి స్టాలిన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉదయనిధి స్టాలిన్ ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రకాష్ రాజ్, సత్యరాజ్ ఉదయనిధి కామెంట్స్ ని స్వాగతించారు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తో పాటు కొందరు వ్యతిరేకించారు.
36
స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam) సైతం సనాతన ధర్మకి మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం తెలియజేశారు. సనాతన ధర్మ వ్యతిరేకుల నుండి ఆమె ప్రశ్నలు, కౌంటర్లు ఎదురయ్యాయి. వాటన్నింటికీ రష్మీ సహనంగా సమాధానాలు చెబుతున్నారు. నిన్నటి నుండి సోషల్ మీడియాలో రష్మీ గౌతమ్ ఈ అంశం మీద వరుస ట్వీట్స్ వేస్తున్నారు.
46
Rashmi Gautam
సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న ఓ నెటిజన్... రష్మీ గౌతమ్ హాట్ ఫోటో జోడించి... సనాతన ధర్మంలో దీనికి చోటు ఉందా? అంగీకరిస్తారా? అని ప్రశ్నించాడు. సదరు ప్రశ్నకు రష్మీ గౌతమ్ తనదైన శైలిలో సమాధానం చెప్పింది.
56
వాదన గెలవలేనప్పుడు, వాళ్ళ దగ్గర పాయింట్ లేనప్పుడు ఇలాంటి చెత్త చర్యలకు దిగుతారని ఆమె కౌంటర్ వేశారు. నాతో నిర్మాణాత్మకంగా వాదించలేనివాళ్ళు ఇలాంటి ఫోటోలు పెట్టి, సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారని ఆమె అసహనం వ్యక్తం చేసింది. రష్మీ గౌతమ్ రిప్లై వైరల్ అవుతుంది.
66
చెప్పాలంటే ఇది అంతం లేని చర్చ. శతాబ్దాలుగా సనాతన ధర్మ మీద సందిగ్ధత ఉంది. హిందువుల్లో కూడా ఒక వర్గం దీనికి వ్యతిరేకం. రాజకీయాల కోసం జనాల ఎమోషన్స్ తో నాయకులు ఆడుకుంటూ ఉంటారు. మధ్యలో బలి అయ్యేది అమాయకజనాలే అని విశ్లేషకుల వాదన.