సంచలనం... ఖరీదైన విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన హీరో ఎవరో చెప్పి నోళ్లు మూయించిన యాంకర్ రష్మీ!

Published : Nov 22, 2022, 01:48 PM IST

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ కి ప్రముఖ హీరో గిఫ్ట్ గా ఇచ్చాడన్న వార్తలకు ఆమె క్లారిటీ ఇచ్చారు. తనకు విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన హీరో ఎవరో చెప్పి అందరి నోళ్లు మూయించారు. రష్మిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

PREV
16
సంచలనం... ఖరీదైన విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన హీరో ఎవరో చెప్పి నోళ్లు మూయించిన యాంకర్ రష్మీ!

సెలబ్రిటీల  జీవితాలను ఉద్దేశిస్తూ అనేక పుకార్లు తెరపైకి వస్తాయి. వాటిలో కొన్ని నిజం ఉంటే చాలా వరకు అవాస్తం. వ్యూస్ కోసం యూట్యూబ్ ఛానల్స్ పెట్టే థంబ్ నెయిల్స్ దారుణంగా ఉంటాయి. బ్రతికి ఉన్న నటులు చనిపోయారంటూ ప్రచారం చేసిన సందర్భాలు కూడా మనం చూశాం. యాంకర్ రష్మీపై ఇదే తరహా రూమర్ ప్రచారం అవుతుండగా ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. 
 

26

శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా బుల్లితెర స్టార్స్ ని ఉద్దేశిస్తూ యూట్యూబ్ లో ప్రచారం అవుతున్న థంబ్ నెయిల్స్ ప్రదర్శించారు. జడ్జి ఇంద్రజ, యాంకర్ రష్మీ, కమెడియన్ హైపర్ ఆది సోషల్ మీడియా నిరాధార ఆరోపణలు సమాధానం చెప్పారు. 
 

36


దానధర్మాలు చేస్తున్న ఇంద్రజపై ఐటీ దాడులు... ఒక వార్త ప్రచారం అవుతుంది. ఈ థంబ్ నెయిల్ కి ఇంద్రజ సమాధానం చెప్పారు. దానధర్మాలు చేస్తున్నాని మీరే అంటున్నారు. ఐటీ దాడులు జరగడానికి ఇంకా నా దగ్గర ఏముంటుంది? ఈ వార్త పూర్తిగా అవాస్తవం. నాపై ఎలాంటి దాడులు జరగలేదు. ఎవరైన మనవాళ్ళు ఇబ్బందిలో ఉన్నారన్న విషయం నా చెవికి చేరితే సహాయం చేయడంలో ముందుంటానని ఇంద్రజ చెప్పారు. 

46


ఒక్కో ఎపిసోడ్ కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హైపర్ ఆది... అనే వార్త సైతం చాలా కాలంగా ప్రచారం అవుతుంది. దీనికి హైపర్ ఆది క్లారిటీ ఇచ్చారు. అయితే ఎంత తీసుకునేది ఆయన చెప్పలేదు. టీమ్ సభ్యులకు  రెమ్యునరేషన్, స్కిట్ కోసం, పంచెస్ కోసం కష్టపడాలి. కాబట్టి నేను ఎంత తీసుకుంటాను అని చేతులతో చూపించి, తెలివిగా తప్పుకున్నాడు. 

56

కాగా రష్మీ మాత్రం తనపై ప్రచారం అవుతున్న వదంతు విషయంలో ఎమోషనల్ అయ్యారు. ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ హీరో రష్మీకి ఖరీదైన విల్లా బహుమతిగా ఇచ్చాడనేది సదరు ప్రచారం. 
 

66

ఈ వార్తకు సమాధానంగా రష్మీ... నాకు విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన హీరో ఎవరో కాదు అది నేనే. విల్లా, కార్లు, ఇళ్ళు, ప్లాట్స్... ప్రతిదీ నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను. డే అండ్ నైట్ కస్టపడి, షూటింగ్స్ చేసి సంపాదించి సమకూర్చుకున్నాను. ఆడపిల్లపై ఇలాంటి నిరాధార కథనాలు ప్రచారం చేయడం సరికాదు అన్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories