పొట్టి షాట్‌లో బీచ్‌లో రెచ్చిపోయిన యాంకర్‌ రష్మి.. వెకేషన్‌కి వెళ్లినా సుధీర్‌ గోల తప్పడం లేదుగా!

First Published Dec 9, 2022, 12:30 PM IST

రష్మి గత నెలలో వెకేషన్‌ని ఎంజాయ్‌ చేసింది. ఆమె చాలా రోజులపాటు నాన్‌ స్టాప్ గా రచ్చ చేసింది. బీచ్‌ ఫోటోలతో కేకపెట్టించిన ఈ హాట్‌ యాంకర్‌ ఇప్పుడు మరోసారి టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియా అవుతుంది. 

`జబర్దస్త్` రష్మి మరో వెకేషన్‌ వీడియాతో రచ్చ చేస్తుంది. బీచ్‌లో దిగిన వీడియోని షేర్‌ చేసిందీ అందాల భామ. మేకప్‌ లేకుండా షాకిచ్చిన ఈ అందం తాజాగా ప్యాంట్‌ లేకుండా మెరిసింది. మరీ పొట్టిదైన షాట్‌లో బీచ్‌లో విహరిస్తుంది. షర్ట్ బటన్స్ విప్పి బీచ్‌లో హల్‌చల్‌ చేసింది. అందమైన సముద్రాన్ని తిలకించేందుకు వెళ్లిన ఆమె అక్కడ హల్‌చల్‌ చేసిన ఓ వీడియోని షేర్‌ చేసింది. 

అయితే ఆ మధ్య రష్మి మాల్దీవులకు వెళ్లిన విసయం తెలిసిందే. దీపికా పిల్లితో కలిసి రష్మి విహార యాత్రకి వెళ్లింది. అక్కడ నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్‌ చేసిన ఈ బ్యూటీ మేకప్‌ లేని ఫోటోలను సైతం ఇన్‌స్టాలో షేర్‌ చేసి కనువిందు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీచ్‌లో చిలిపి పోజులతో దిగిన వీడియో క్లిప్‌ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. అది వైరల్‌ అవుతుంది. 
 

అయితే రష్మికి వెకేషన్‌ వెళ్లినా సుధీర్‌ గోల తప్పడం లేదు. `జబర్దస్త్`లో వీరిద్దరి జోడి మోస్ట్ పాపులర్‌ జోడీ అనే విషయం తెలిసిందే. ఈ జంటని కొట్టే మరో జంట ఇప్పటి వరకు రాలేదు. ఎవ్వరైనా వీరి తర్వాతే, లవ్‌ డ్రామా అయినా, డ్యూయెట్లు అయినా, రొమాన్స్ అయినా, లవ్‌ ప్రపోజల్‌ అయినా, పెళ్లి చేసుకోవడమైనా డ్రామాని పండించడంలో వీరి తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. 

ఈ జంట మధ్య వచ్చే ప్రతి స్కిట్‌, ప్రతి సీన్‌ పేలుతుంది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంటాయి. `జబర్దస్త్` షోకి హైప్‌ని, క్రేజ్‌ని పెంచుతుంటుంది. అయితే ఈ మధ్య వీరిద్దరు విడిపోయారు. అంటే `జబర్దస్త్`, `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లను సుధీర్‌ వదిలేశాడు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చింది. రెండు మూడు నెలలుగా ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీగా ఉన్నారు. 

Sudigali Sudheer - Rashmi gautam

కానీ వీరిని అభిమానులు వదలడం లేదు. రష్మి ఎక్కడికి వెళ్లినా ఆమెకి, సుడిగాలి సుధీర్‌కి లింక్‌ పెడుతున్నారు. తాజాగా మాల్దీవుల ఫోటోలు పంచుకున్నా అందులో సుధీర్‌ అన్న రాలేదా? సుధీర్‌తో వెళ్లలేదా? నీకు సుధీరే బెస్ట్ ఛాయిస్‌ అని, సుధీర్‌ వల్లే నీకు క్రేజ్‌ అని, సుధీరే నీకు ఎక్కువ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇద్దరు కలిసి షోలు చేయాలని అడ్వైజ్లిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆ బాధ తప్పడం లేదు రష్మికి. చివరకు మాల్దీవులకు వెళ్లినా ఆ పోస్ట్ లు మానడం లేదు నెటిజన్లు. 
 

మరోవైపు ఇటీవల గ్లామర్‌ ఫోటోలు తగ్గించింది రష్మి. ప్రతి వారం ఆమె లేటెస్ట్ ట్రెండీ వేర్‌లో మెరుస్తుంటుంది. అభిమానులకు అందాల విందు ఇస్తుంటుంది. తన డస్కీ అందాలను ఆవిష్కరిస్తూ మరింత హాట్‌ ఫోటో షూట్‌ చేస్తుంటుంది. వాటిని ఇన్‌స్టాలో పంచుకుంటూ నెటిజన్లకి కనువిందు చేస్తుంటుంది. 

దీంతో ఈ మధ్య ఆ గ్లామర్‌ పిక్స్ కొరత ఏర్పడింది. దీంతో రష్మిపై అసంతృప్తితో ఉన్నారు ఫ్యాన్స్. అందుకు ఇలా బీచ్‌లోని ఫోటోలు వీడియోలు షేర్‌ చేస్తూ ఖుషీ చేస్తుంది. ఎప్పటిలాగే తనపై అటెన్షన్‌ పెంచుకుంటుందీ సెక్సీ అందాల యాంకర్‌. 
 

ఇదిలా ఉంటే రష్మి యాంకర్‌గానే కాదు నటిగానూ రాణిస్తుంది. ఇటీవల ఆమె `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు. రష్మికి మంచి పేరే తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే త్వరలో సుడిగాలి సుధీర్‌తో కలిసి సినిమా చేయబోతుందట. `గాలోడు` ఫేమ్‌ రాజశేఖర్‌  ఈ ఇద్దరు కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మరి వర్కౌట్‌ అవుతుందా? లేదా చూడాలి. 

click me!