అర్థరాత్రి మేకప్‌ లేకుండా రెచ్చిపోయిన యాంకర్‌ రష్మి, దీపికా పిల్లి.. ఐస్‌క్రీమ్‌ తింటూ కొంటె పోజులు..

Published : Apr 15, 2023, 05:34 PM ISTUpdated : Apr 16, 2023, 09:42 AM IST

జబర్దస్త్ యాంకర్‌ రష్మి, ఢీ భామ దీపికా పిల్లి మంచి స్నేహితులు. వీరిద్దరి బాండింగ్‌ ని తరచూ చాటుకుంటున్నారు. కానీ అది పీక్‌లోకి వెళ్లింది. బర్త్ డే రాత్రి ఈ ఇద్దరు మేకప్‌ లేకుండా రెచ్చిపోయిన తీరు సర్‌ప్రైజింగ్‌గా ఉంది.

PREV
17
అర్థరాత్రి మేకప్‌ లేకుండా రెచ్చిపోయిన యాంకర్‌ రష్మి, దీపికా పిల్లి.. ఐస్‌క్రీమ్‌ తింటూ కొంటె పోజులు..

యాంకర్‌ రష్మి గౌతమ్‌, క్యూట్‌ బ్యూటీ దీపికా పిల్లి రెచ్చిపోయారు. మేకప్‌ లేకుండా ఈ ఇద్దరు కలిసి హంగామా చేశారు. రాత్రి పార్టీ చేసుకుని రచ్చ రచ్చ చేశారు. కొంటె పోజులిస్తూ ఈ ఇద్దరు భామలు చేసిన హంగామా మామూలు కాదు. ప్రస్తుతం అవి నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 

27

క్యూట్‌ అండ్‌ హాట్‌ బ్యూటీ దీపికా పిల్లి పుట్టిన రోజు నేడు. అయితే రాత్రి పార్టీ చేసుకున్నారు. రష్మి గౌతమ్‌.. దీపికా బర్త్ డే ని సెలబ్రేట్‌ చేసింది. కేక్‌ కట్‌ చేయించింది. ఆ కేక్‌, ఐస్‌ క్రీములు తింటూ హల్‌చల్‌ చేశారు. ఒకరికొకరు కేక్‌లు తినిపిస్తూ పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా సెల్ఫీలు దిగి వాటిని మిక్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది రష్మి గౌతమ్‌. 
 

37

ఇందులో వీరిద్దరి ఎక్స్ ప్రెషన్స్ కిర్రాక్‌గా ఉండటం విశేషం. కొంటెగా, చిలిపిగా, కన్నింగ్‌గా హవభావాలు పలికించారు. ఎలాంటి హద్దుల్లేకుండా రెచ్చిపోయారు. అయితే ఇందులో వీరిద్దరు మేకప్‌ లేకుండా కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్‌ని, స్నేహాన్ని చాటుతున్నాయీ ఫోటోలు. 
 

47

ఇందులో బ్లాక్‌ టాప్‌, బ్లూ జీన్స్ ధరించారు. సెల్ఫీల్లో దీపికా పిల్లి హాట్‌ పోజులివ్వడం విశేషం. నాన్‌ స్టాప్‌ ఎంజాయ్‌తో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

57

 దీపికా పిల్లిని ఉద్దేశించి రష్మిగౌతమ్‌ పోస్ట్ పెట్టింది. ఆమె తన కళ్ల ముందే ఎదుగుతుందని, అందుకు చాలా గర్వంగా ఉందని పేర్కొంది రష్మి. గతేడాది చాలా కష్టంగా సాగిందని, కానీ ఇప్పుడు ఉన్న స్థానం విషయంలో తనకు గర్వంగా ఉందని చెప్పింది రష్మి. 

67

రష్మి గౌతమ్‌, దీపికా పిల్లి కలిసి `ఢీ` షోలో చేశారు. వీరిద్దరు క్వీన్స్ టీమ్‌ డాన్సర్లకి లీడర్లుగా వ్యవహరించారు. దాదాపు ఏడాది పాటు వీరిద్దరు కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య బాండింగ్‌ ఏర్పడింది. మంచి స్నేహం ఏర్పడింది. అది మరింత పెరిగింది. ఇప్పుడు కూడా రన్‌ అవుతుంది. అయితే కష్టసమయంలో దీపికాకి రష్మి అండగా ఉందనే విషయం అర్థమవుతుంది. 
 

77

దీపికా పిల్లి టిక్‌ టాక్‌ షో నుంచి టీవీ షోస్‌లోకి వచ్చింది. యాంకర్‌గా రాణించింది. `ఢీ` షోతో పాపులర్‌ అయ్యింది. కొన్నాళ్లపాటు `స్టార్‌ మా`లో కామెడీ స్టార్స్ షోకి యాంకర్‌గా చేసింది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్‌తో కలిసి `స్టాండర్‌ కామెడీ` షోకి యాంకర్‌గా చేసింది. అంతకు ముందు `వాంటెడ్‌ పండుగాడ్‌`లో సుధీర్‌తో కలిసి హీరోయిన్‌గా యాక్ట్ చేసి మెప్పించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories