రష్మీ వయసు ఇంకా పదహారేళ్లే అట.. ప్రదీప్‌కి షాకిచ్చిన `జబర్దస్త్` యాంకర్‌

Published : Aug 17, 2021, 02:47 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ రష్మీ గౌతమ్‌ `ఢీ` షోకి షాక్‌ ఇచ్చింది. తన ఏజ్‌ గురించి చెప్పి అవాక్కయ్యేలా చేసింది. రష్మీ చెప్పిన ఆన్సర్‌కి నోరెళ్ల బెట్టాడు యాంకర్ ప్రదీప్‌. అంతేకాదు సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.   

PREV
16
రష్మీ వయసు ఇంకా పదహారేళ్లే అట.. ప్రదీప్‌కి షాకిచ్చిన `జబర్దస్త్` యాంకర్‌

ఇందులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. యాంకర్‌ ప్రదీప్‌ హాస్టల్‌ వార్డెన్‌గా ఉన్నాడు. తాను స్టిక్ట్ వార్డెన్‌ని అంటూ కామెడీకి తెరలేపారు. 
 

26

ఇంతలో యాంకర్‌ రష్మీ, దీపికా పిల్లి వచ్చారు. నాలుగు అమ్మాయిలు వచ్చి హాస్టల్‌లో జాయిన్‌ కావాలని వచ్చామని చెప్పగా, మీ పేర్లు, ఏజ్‌ చెప్పండి అని అడిగాడు ప్రదీప్‌. 

36

రష్మీ `ఢీ` షోలో క్వీన్స్ టీమ్‌కి లీడర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. దీపికా పిల్లితో కలిసి ఆమె సందడి చేస్తుంది. ఇందులోనూ సుడిగాలి సుధీర్‌తో రచ్చ చేస్తూ టీవీ ఆడియెన్స్ కి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ని పంచుతుంది. 

46

యాంకర్‌ రష్మీ తన పేరు బుచ్చి, దీపికా పిల్లి తన పేరు సుచి అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అంతకు బాగానే ఉంది. కానీ ప్రదీప్‌ ఏజ్‌ అడిగాడు దీంతో రెచ్చిపోయింది రష్మీ. 

56

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ `పోకిరి` సినిమాలోని ముమైత్‌ ఖాన్‌ ఐటెమ్‌ సాంగ్‌ని పాడింది. తన ఏజ్‌ ఇంకా పదహారే అని విషయాన్ని ప్రదీప్‌కి చెప్పగా, ఆయన షాక్‌ అయ్యాడు. ఆయనే కాదు, జడ్జ్ లు ప్రియమణి, పూర్ణ, గణేష్‌ మాస్టర్ ఇలా అందరు ఆశ్చర్యానికి గురయ్యారు.
 

66

దీనికి కౌంటర్‌గా ప్రదీప్‌ స్పందిస్తూ పదహారు ఒక్కట్ల, పదహారు రెండ్లా అంటూ అడగ్గా, సుడిగాలి సుధీర్‌ స్పందిస్తూ పదహారు మూళ్లు అని చెప్పడంతో రష్మీ షాక్‌ అయ్యింది. ఇది ఆద్యంతం కామెడీని పంచింది. రేపు బుధవారం ఈటీవీలో ఇది ప్రసారం కానుంది. ప్రోమోనే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక మొత్తం ఎపిసోడ్‌ ఇంకా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories