యాంకర్ ప్రదీప్ మాచిరాజు మంచి మనసులు... ఆయన ఏం చేశారో తెలిస్తే ప్రశంసించకుండా ఉండలేరు

Published : Apr 14, 2024, 02:38 PM IST

 స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు చేసిన మంచి పని ఒకటి వెలుగులోకి వచ్చింది. అతని సహాయం పొందిన ఓ వ్యక్తి కృతజ్ఞత చాటుకున్నాడు.   

PREV
15
యాంకర్ ప్రదీప్ మాచిరాజు మంచి మనసులు... ఆయన ఏం చేశారో తెలిస్తే ప్రశంసించకుండా ఉండలేరు

ప్రదీప్ మాచిరాజు బుల్లితెర స్టార్ యాంకర్స్ లో ఒకరు. ఏళ్ల తరబడి మేల్ యాంకర్ గా ఆయన తిరుగులేని ఆధిపత్య ప్రదర్శించారు. గడసరి అత్తా సొగసరి కోడలు షో ఆయనకు ఫేమ్ తెచ్చింది. కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను. ఢీ డాన్స్ రియాలిటీ షో వంటి సక్సెస్ ఫుల్ షోలకు ఆయన యాంకర్ గా వ్యవహరించాడు. 

25

ప్రదీప్ మాచిరాజు సెలబ్రిటీ కాగా ఆయన కొన్ని వివాదాలు ఎదుర్కొన్నారు. ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆయన దొరికారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అప్పడు తన తప్పు ఒప్పుకుని ఇకపై చేయనని ప్రదీప్ మాచిరాజు క్షమాపణలు కోరాడు. 

 

35

అలాగే ఆయన కొన్ని లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఓ అమ్మాయి తనపై లైంగిక దాడి చేశారని ప్రదీప్ మాచిరాజు పేరు చెప్పడం గమనార్హం. అయితే ఆ అమ్మాయి అబద్దం చెప్పిందని తర్వాత తెలిసింది. ఈ వివాదంలో పలువురు టీవీ సెలెబ్స్ అతనికి మద్దతుగా నిలిచారు . 

45
Pradeep Machiraju

ప్రదీప్ మాచిరాజు తాను సంపాదించిన మొత్తంలో కొంత దానం చేస్తాడట. కాగా ఓ సింగర్ ని ఆయన చదివిస్తానని ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాడు. యువ సింగర్ పవన్ కళ్యాణ్ గతంలో సరిగమప షోలో పాల్గొన్నాడు. పవన్ కళ్యాణ్ ఆర్థిక ఇబ్బందులు తెలుసుకున్న ప్రదీప్... తన చదువుకు అయ్యే ఖర్చు తాను భరిస్తానని హామీ ఇచ్చాడు. 

 

55
Pradeep Machiraju

ఇచ్చిన మాట ప్రకారం ప్రదీప్ తనను బీటెక్ చదివించాడని. నాలుగేళ్లు ప్రదీప్ తనకు ఫీజులు చెల్లించాడని పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దాంతో ప్రదీప్ మంచి మనసును పలువురు కొనియాడుతున్నారు. కాగా ప్రదీప్ ప్రస్తుతం యాంకరింగ్ కి దూరం గా ఉంటున్నాడు. ఆయన హీరోగా సినిమా చేస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది.. 
 

click me!

Recommended Stories