139 మంది రేప్‌ కేసులో‌ పేరు.. చేతులు జోడించి వేడుకున్న యాంకర్‌ ప్రదీప్

మనస్థాపానికి గురైన యాంకర్‌ ప్రదీప్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన మీద వచ్చిన ఆరోపణలను ఖండించిన ప్రదీప్‌, ఆన్‌లైన్‌లో ఇలాంటి వార్తలకు ప్రచారం కల్పిస్తున్న వారి మీద విరుచుకుపడ్డాడు. నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రావటం వల్ల తాను, తన కుటుంబం ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఒక యువతి మీద ఏకంగా 139 మంది అత్యాచారం చేసినట్టుగా ఫిర్యాదు రావటంతో ఆ కేసు సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో కొంత మంది ప్రముఖుల పేర్లు కూడా బయటకు రావటంతో సామాన్య ప్రజలు కూడా ఈ కేసు గురించి క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు.
ఈ కేసులో ప్రముఖ యాంకర్‌ ప్రదీప్ పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఆ యువతిని ఇబ్బంది పెట్టిన వారిలో ప్రదీప్‌ కూడా ఉన్నాడంటూ వార్తలు రావటంతో ఆ న్యూస్‌ వైరల్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా ప్రదీప్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

దీంతో మనస్థాపానికి గురైన యాంకర్‌ ప్రదీప్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన మీద వచ్చిన ఆరోపణలను ఖండించిన ప్రదీప్‌, ఆన్‌లైన్‌లో ఇలాంటి వార్తలకు ప్రచారం కల్పిస్తున్న వారి మీద విరుచుకుపడ్డాడు. నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రావటం వల్ల తాను, తన కుటుంబం ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
తన ఫేస్‌ బుక్‌ పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసిన ప్రదీప్‌, నిజం తేలే వరకు ఇలాంటి వార్తలు రాయవద్దని మీడియాను చేతులు జోడించి వేడుకున్నాడు. ఈ కేసులోకి తన పేరును లాగిన వారిపై న్యాయపోరాటం చేస్తానని చెప్పాడు.
గతంలోనూ తన విషయంలో ఇలాంటి సోషల్ ట్రోలింగ్ జరిగిందని, తాను చనిపోయినట్టుగా ఒకసారి, అంతుచిక్కని వ్యాదితో బాధపడుతున్నట్టుగా మరోసారి సోషల్‌ మీడియా వార్తలు రాసి వేదించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా సే నో టు సోషల్‌ ట్రోలింగ్ అనే ఉద్యమానికి తాను సిద్ధమవుతున్నట్టుగా తెలిపాడు ప్రదీప్.యాంకర్‌ ప్రదీప్‌‌ వీడియో లింక్‌:https:www.youtube.comwatch?v=cfjc5WFpuLE

Latest Videos

click me!