కరోన వార్తలపై నోయల్ క్లారిటీ.. మరి బిగ్‌ బాస్‌ గురించి ఏమన్నాడు?

First Published | Aug 27, 2020, 6:11 PM IST

యువ గాయకుడు నోయల్‌ బిగ్ బాస్‌ షోలో పాల్గొనబోతున్నాడన్న వార్త  కొద్ది రోజులుగా వినిపిస్తోంది. షో కోసం నోయల్‌ కొద్ది రోజులుగా క్వారెంటైన్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నోయల్‌ కరోన బారిన పడినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై నోయల్‌ స్పందించాడు.

టాలీవుడ్ బిగ్‌ బాస్ సందడి ఊపందుకుంది. మూడు సీజన్లు సూపర్‌ హిట్ కావటంతో నాలుగో సీజన్‌ మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూడో సీజన్‌ను హోస్ట్ చేసిన కింగ్ నాగార్జుననే ఈ సీజన్‌ కూడా వ్యాఖ్యతగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే నాగ్ నటించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.
షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్‌ విషయంలోనూ రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో యువ గాయకుడు నోయల్‌ బిగ్ బాస్‌ షోలో పాల్గొనబోతున్నాడన్న వార్త ప్రధానంగా వినిపించింది. షో కోసం నోయల్‌ కొద్ది రోజులుగా క్వారెంటైన్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో నోయల్‌ కరోన బారిన పడినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై నోయల్‌ స్పందించాడు. తాను కరోన బారిన పడినట్టుగా వస్తున్న వార్తలను నోయల్‌ ఖండించాడు. తాను హెల్తీగా ఉన్నట్టుగా క్లారిటీ ఇచ్చాడు. కరోన విషయంలో క్లారిటీ ఇచ్చిన నోయల్‌ బిగ్‌ బాస్‌లో పాల్గొనే విషయంలో మాత్రం ఎలాంటి స్పందనా ఇవ్వలేదు.
నాగ్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్‌ సీజన్‌ 4ను ఈ నెల 30న ప్రారంభించాలి ప్లాన్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో షోను వారం రోజుల పాటు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు బిగ్ బాస్‌ యూనిట్ మాత్రం షో ప్రారంభమయ్యే డేట్‌ విషయంలో ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Latest Videos

click me!