నేను ఫలానా వాడితో ఉన్నాను, పోలీసుల రైడ్ లో దొరికాను... జనాలు నాలో చూసిన చెత్త ఇదే!

Published : May 11, 2023, 06:03 PM IST

యాంకర్ ఝాన్సీ మీడియాతో పాటు, తనపై తప్పుడు వార్తలు రాయించిన వారిపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ఆమె కొన్ని సీరియస్ అలిగేషన్స్ చేశారు.   

PREV
16
నేను ఫలానా వాడితో ఉన్నాను, పోలీసుల రైడ్ లో దొరికాను... జనాలు నాలో చూసిన చెత్త ఇదే!

సీనియర్ యాంకర్ ఝాన్సీ తెలియనివారుండరు. ఆమె నటిగా కూడా రాణిస్తున్నారు. అయితే పరిశ్రమలో తనకు జరిగిన అన్యాయం, తప్పుడు ప్రచారం మీద ఆమె ఓపెన్ అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. 
 

26

ఝాన్సీ మాట్లాడుతూ... నాకు అన్యాయం చేసిన వాళ్లకు తప్పకుండా ఉసురు తగులుతుంది. అలా తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. రెండు రోజులు షూటింగ్ చేశాక ఓ మూవీ నుండి నన్ను తప్పించారు. ఓ పెద్ద డైరెక్టర్, స్టార్ హీరో మూవీలో నేను ఓ క్యారెక్టర్ చేస్తున్నాను. రెండ్రోజులు షూటింగ్ చేశాను. నాకు రావాల్సిన మొత్తం ఇచ్చేశారు. కానీ ఆ క్యారెక్టర్ నుండి నన్ను తప్పించారు. నా ప్లేస్ లో వేరొకరిని తీసుకుంటే నాకు బాధేస్తుంది కదా... 
 

36

వాళ్లకు మామూలు దెబ్బ తగల్లేదు. కోలుకోలేని నష్టం చూశారు. అది నాకు అన్యాయం చేయడం వలనే అని నేను చెప్పను. ఆ సినిమాలో దమ్ము లేదు. అందుకే ప్లాప్ అయ్యింది. ఝాన్సీ గొప్పతనం, చేసిన మంచి గురించి తెలియాలంటే గూగుల్ లో పదో పేజీలోనో, పదిహేనో పేజీలోనో వెతకాలి. కానీ నా గురించి చెత్త వార్తలు మాత్రం ఫ్రంట్ పేజీలోనే ఉంటాయి. 
 

46


జనాలకు నా గురించి తెలిసిన చెత్త ఏంటయ్యా అంటే...  ఫలానా హీరోతో ఎఫైర్ పెట్టుకుంది. పోలీసుల రైడ్ లో దొరికింది... ఇలాంటివి. నేను పోలీసు రైడ్స్ లో దొరికితే ఇక్కడ ఉంటానా. అవి ఎవరు రాశారో? ఎవరు రాయించారో? నాకు తెలుసు. నాకు ఎనిమిది నంది అవార్డులు వచ్చాయి. వాటి గురించి ఎవరికీ తెలియదు. 

56

వెబ్ మీడియా దారుణంగా తయారైంది. ఒకరు ఏదైనా రాయగానే అందరూ అదే రాస్తారు. రీసెర్చ్ చేసి, ఫోన్ చేసి మాట్లాడి అసలు విషయం రాసేవాళ్ళు లేరు. అంతా కాపీ పేస్ట్ బ్యాచ్. అలాంటి వాళ్ళు రాసే రాతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాపై వచ్చిన నిరాధార కథనాల వలన ఒక పదవి కోల్పోయాను. అది నన్ను బాధపెట్టింది.

66

యునెస్కో తరపున నేను చాలా కాలంగా పనిచేస్తున్నాను. కర్ణాటక అండ్ సౌత్ అంబాసిడర్ గా నన్ను ఎంపిక చేయాలని వారు భావించారు. వారు అన్ని విధాలా ఎంక్వరీ చేస్తారు. నాపై వచ్చిన కథనాలు వాళ్లకు చేరాయి. దాంతో ఆ పదవికి నన్ను ఎంపిక చేయలేదు. దాని వలన పైసా నష్టం లేదు కానీ గౌరవం కోల్పోయాననే బాధేసిందని ఝాన్సీ చెప్పుకొచ్చారు. 
 

click me!

Recommended Stories