Anchor Anushree: రెండేళ్లు సీక్రెట్ డేటింగ్, జ్యూస్‌లో ఏమైనా కలిపారేమోనని భయపడ్డా.. లవ్‌ స్టోరీ బయటపెట్టిన అనుశ్రీ

Published : Apr 07, 2026, 09:57 PM IST

ప్రముఖ కన్నడ యాంకర్ అనుశ్రీ తన భర్త రోషన్‌తో తన రెండేళ్ల సీక్రెట్ డేటింగ్, ప్రేమకథను మొదటిసారి అభిమానులతో పంచుకున్నారు. తమ ప్రేమకు నటుడు రాజ్ బి. శెట్టి ఎలా కారణమయ్యారో ఆమె బయటపెట్టారు. 

PREV
16
ప్రేమ, పెళ్లి గురించి ఓపెన్‌ అయిన యాంకర్‌ అనుశ్రీ
కన్నడ బుల్లితెర స్టార్ యాంకర్ అనుశ్రీ ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో కొడగుకు చెందిన రోషన్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లికి ముందు, ఎప్పుడు అడిగినా పెళ్లి ప్రస్తావన దాటవేస్తూ వచ్చారు. తన ప్రేమ, పెళ్లి గురించి ఎక్కడా చెప్పలేదు.
26
రోషన్‌తో అనుశ్రీ రెండేళ్లు డేటింగ్‌

ఇప్పుడు తొలిసారిగా తన లవ్ స్టోరీని బయటపెట్టారు అనుశ్రీ. `నేను, రోషన్ రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నాం. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. చాలామంది అతన్ని నా బాడీగార్డ్ అనుకున్నారు` అని 'Gold Class With Mayuraa' యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

36
లవ్‌ స్టోరీ వెనుక రాజ్‌ బి శెట్టి

అనుశ్రీకి రోషన్.. శ్రీదేవి అనే వ్యక్తి ద్వారా పరిచయమయ్యారు. కానీ వాళ్లిద్దరి మధ్య బంధం పెరగడానికి కారణం నటుడు రాజ్ బి. శెట్టి. `తొలిసారి రోషన్‌ను హోసపేటలో కలిశాను. నన్ను చూడగానే కాఫీకి వెళ్దామా అని అడిగాడు. ఆ మాట విని షాక్ అయ్యాను` అని అనుశ్రీ ఆ రోజును గుర్తుచేసుకున్నారు.

46
జ్యూస్‌లో ఏమైనా కలిపి ఇస్తాడేమో అనుకున్నా

`ఒంటరి అబ్బాయి అలా కాఫీకి పిలిచేసరికి భయమేసింది. జ్యూస్‌లో ఏమైనా కలిపి ఇస్తే ఏంటి పరిస్థితి అని కంగారుపడ్డాను. వెంటనే రాజ్ శెట్టికి విషయం చెప్పాను. దానికి ఆయన, 'ఓహో, నువ్వేదో పెద్ద ఐశ్వర్య రాయ్ అనుకుంటున్నావా? సైలెంట్‌గా వెళ్లు' అని పంపించారు` అని అనుశ్రీ చెప్పారు.

56
రోషన్‌కి చెమటలు పట్టాయి

`రాజ్ శెట్టి ధైర్యం చెప్పడంతో రోషన్‌ను కలిశాను. షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడే అతనికి చెమటలు పట్టేశాయి. రెండు గంటలు అనుకున్న మా మాటలు నాలుగు గంటలైనా ఆగలేదు. మధ్యలో రాజ్ కాల్ చేయడంతో మళ్లీ ఈ లోకంలోకి వచ్చాం` అని ఆ రోజు జరిగిన సంఘటనను అనుశ్రీ వివరించారు.

66
రోషన్‌ని నా బాడీ గార్డ్ అనుకున్నారు

ఆ తర్వాత రాజ్ శెట్టి ఆ అబ్బాయి గురించి అడిగినప్పుడు, 'నచ్చాడు' అని చెప్పాను. అలా మా స్నేహం కొనసాగింది. రెండేళ్లు డేటింగ్ చేశాం. చాలా చోట్ల తిరిగాం. కానీ ఈ విషయం ఎవరికీ తెలియలేదు. చాలామంది అతన్ని నా బాడీగార్డ్ అనుకునేవారు` అని అనుశ్రీ తన సీక్రెట్ లవ్ స్టోరీని ముగించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories