Dhurandhar 2 Collections: `పుష్ప 2` ని కొడుతుందనుకుంటే డీలా పడ్డ `ధురంధర్‌ 2`.. టోటల్‌ కలెక్షన్లు ఇవే

Published : Apr 07, 2026, 08:55 PM IST

Dhurandhar 2 Collections: రణ్‌వీర్ సింగ్ నటించిన `ధురంధర్‌ 2` మూవీ బాక్సాఫీసు వద్ద డీలా పడింది. `పుష్ప 2` రికార్డులు బ్రేక్‌ చేస్తుందనుకున్న ఈ చిత్రం ఇప్పుడు స్ట్రగుల్‌ అవుతుంది. మరి ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందనేది చూస్తే,    

PREV
16
బాక్సాఫీసు వద్ద జోరు తగ్గిన `ధురంధర్‌ 2`

రణ్‌వీర్‌ సింగ్‌, మాధవన్‌, సారా అర్జున్‌, సంజయ్‌ దత్‌ వంటి వారు నటించిన `ధురంధర్‌ 2` మూవీ విడుదల నుంచి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి ఉన్న క్రేజ్‌, బజ్‌, ఆదరణ చూసి అంతా ఇది ఇండియన్‌ బాక్సాఫీసు రికార్డులను బ్రేక్‌ చేస్తుందనుకున్నారు. కానీ ఇప్పుడు డీలా పడిపోయింది. మొదటి వారంలో ఉన్న జోరు రెండో వారంలో లేదు. మూడో వారంలో బాగా పడిపోయింది.  ఈ సినిమా 20వ రోజు కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి. 19వ రోజు (సోమవారం)తో పోలిస్తే, 20వ రోజు (మంగళవారం) వసూళ్లు మరింత తగ్గాయి.

26
`ధురంధర్‌ 2` 20వ రోజు కలెక్షన్ల వివరాలు

`ధురంధర్‌ 2`  సినిమా మంగళవాారం 20వ రోజు బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.6.52 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 19వ రోజున ఈ సినిమా రూ.10 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు ఇండియాలో నెట్ రూ.1030.29 కోట్లు సంపాదించగా, గ్రాస్ కలెక్షన్ రూ.1233.41 కోట్లకు చేరింది.  

36
ధురంధర్‌ 2 మూడో వారం కలెక్షన్లు
ధరందర్ 2 మూడో వారం కలెక్షన్లను పరిశీలిస్తే.. 16వ రోజు రూ.21.55 కోట్లు, 17వ రోజు రూ.25.65 కోట్లు, 18వ రోజు రూ.28.75 కోట్లు వసూలు చేసింది. కానీ, 19వ రోజుకు వచ్చేసరికి వసూళ్లు దారుణంగా పడిపోయి కేవలం రూ.10 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక 20వ రోజు రూ.6.52 కోట్లు సంపాదించింది. మొదటి వారంలో ఈ సినిమా రూ.674.17 కోట్లు, రెండో వారంలో రూ.263.65 కోట్లు వసూలు చేసింది.
46
ధురంధర్‌ 2 ప్రపంచవ్యాప్త వసూళ్లు

ధురంధర్‌ 2 ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా రూ.1625.72 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. దీంతో భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది.  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 'పుష్ప 2' మూడో స్థానంలో ఉంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1742.10 కోట్లు వసూలు చేసింది.

56
ధురంధర్ 2 పుష్ప 2 రికార్డును బ్రేక్ చేస్తుందా?

`ధురంధర్‌ 2' కలెక్షన్ల పరంగా మరికొంత పుంజుకుంటే 'పుష్ప 2' రికార్డును బద్దలు కొట్టగలదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ తర్వాత 'బాహుబలి 2' (రూ.1788.06 కోట్లు) రికార్డును బ్రేక్ చేయడమే దీని తర్వాతి లక్ష్యం అవుతుంది. అయితే ఇప్పుడు వస్తోన్న కలెక్షన్లని చూస్తుంటే అది సాధ్యమేనా అనేది డౌట్‌గా మారింది. `పుష్ప 2`ని కొట్టాలంటే ఇంకా రూ.120కోట్లకుపైగా వసూళ్లని రాబట్టాలి. ఈ కలెక్షన్ల పరంగా చూస్తే ఇంకా ఇరవై రోజులకుపైగానే అవుతుంది. అయితే రాను రాను వసూళ్లు పడిపోతాయి తప్ప, పెరగవు. ఇదే జరిగితే `పుష్ప 2`ని `ధురంధర్‌ 2` కొట్టడం సాధ్యం కాదని చెప్పొచ్చు. అయితే ఈ మూవీ అన్ని రికార్డులను బ్రేక్‌ చేస్తుందనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

66
ధురంధర్‌ 2 సినిమా గురించి

`ధురంధర్‌ ది రివెంజ్' ఒక స్పై యాక్షన్, థ్రిల్లర్ సినిమా. దీనికి ఆదిత్య ధర్  దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యానర్లపై లోకేష్ ధర్, ఆదిత్య ధర్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఇది 2025లో వచ్చిన` ధురంధర్‌` సినిమాకు సీక్వెల్. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ, గౌరవ్ గెరా, డానిష్ పండోర్, మానవ్ గోహిల్ కీలక పాత్రల్లో నటించారు.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories