మేకప్‌ లేకుండా యాంకర్‌ అనసూయః ఎలా ఉందో చూడండి!

First Published Feb 8, 2021, 9:02 AM IST

అనసూయ ఫోటో షూట్‌లతో అభిమానులను కనువిందు చేస్తుంది. తన మత్తెక్కించే అందాలను కొంచెం కొంచెం చూపిస్తూ ఫిదా చేస్తుంది. మేకప్‌ లో మెస్మరైజ్‌ చేసే అససూయ మేకప్‌లేకుండా ఎలా ఉంటుందో చూశారా? అడపాదడపా చూసి ఉంటారు. కానీ ఈ సారి చూస్తే మాత్రం కచ్చితంగా భయపడతారు. ఈ విషయాన్ని స్వయంగా ఫ్యాన్సే చెప్పడం గమనార్హం. 
 

ఎప్పుడూ గ్లామరస్‌ ఫోటోలు పంచుకుంటూ మైమరపించే హాట్‌ బ్యూటీ అనసూయ తాజాగా మేకప్‌ లేకుండా ఉన్న ఫోటోని పంచుకుంది. సండే స్పెషల్‌గా ఫ్యాన్స్ కి మేకప్‌ లేకుండా ఇంట్లో ఫన్‌ టైమ్‌లో దిగిన ఫోటోని పంచుకుంది.
undefined
చైర్‌పై కూర్చొని కొంటెగా ఓ స్మైల్‌ ఇచ్చింది అనసూయ. `హ్యాపీనెస్‌ ఈజ్‌ ఛాయిస్‌` అని, `హ్యాపీనెస్‌ మన స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌` అని పేర్కొంది. తాను ఈ సండే చాలా సంతోషంగా ఉన్నట్టు, ఫన్ గా సాగినట్టు చెప్పకనే చెప్పేసింది.
undefined
ఇంత వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. అనసూయ మేకప్‌ లేకుండా ఫోటోని పంచుకోవడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తుంది. `మేకప్‌ లేకుండా ఇంతగా భయపెట్టిస్తున్నావేంటి?` అంటున్నారు. `మేకప్‌ లేకుండా అనసూయని తట్టుకోవడం కష్టమే` అంటున్నారు. `భయమేస్తుంద`ని, `మేకప్‌ లేకుండా ఇంత భయంగా ఉంటారా దేవుడా?` అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
undefined
ఆదివారం తాను రిలాక్స్ అవుతూ, నెటిజన్లని భయాందోళనలకు గురి చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మేకప్‌ లేకుండా అనసూయ ఫోటో తెగ వైరల్‌ అవుతుంది. గ్లామర్‌ ఫోటోలకంటే దీన్నే ఎక్కువ వైరల్‌ చేయడం విశేషం.
undefined
`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని, నెటిజన్లని ఫిదా చేస్తుంటుంది. ఆమె అందాలను పొగిడేందుకు అభిమానులు పోటీ పడుతుంటారు.
undefined
కొందరైతే ఏకంగా కవిత్వాలే రాస్తుంటారు. తమలోని రొమాంటిక్‌ యాంగిల్‌ని బయటకు తీసుకొచ్చి మరీ ఆమె అందాలను ఆకాశానికి ఎత్తుతుంటారు. అదే సమయంలో పలు విమర్శలు వస్తుంటాయి.
undefined
చాలా వరకు అనసూయ ట్రెండీ వేర్‌ ధరించినప్పుడు, నడుమందాలను, థైస్‌ని చూపించినప్పుడు మాత్రం చాలా వరకు విమర్శలు ఎదుర్కొంటుంది. `ఫ్యామిలీ షో ఇది, మీరు ఇలా రెడీ అయితే ఎలా `అంటూ చురకలు అంటిస్తుంటారు.
undefined
మరోవైపు అనసూయ అందాలను ఆస్వాదించే వాళ్లు చాలా మందే ఉంటారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో అనసూయ ఓ ఫోటో పెట్టిందంటే ఓ హంగామా ప్రారంభమవుతుంది. ఆ ఫోటోని వైరల్‌ చేసి వదిలేస్తారు అభిమానులు.
undefined
సోషల్‌ మీడియాలో అంత ఫాలోయింగ్‌ అనసూయ సొంతం. అయితే చాలా వరకు ఫ్యాన్స్ ఏం చేసినా అనసూయ ఎంజాయ్‌ చేస్తుంది. కొన్ని విషయాల్లో వివాదాలు మారినా, స్టార్స్ కి అభిమానుల కామెంట్లే ఆనందాన్నిస్తాయి. అందుకు అనసూయ అతీతం కాదనేది సత్యం.
undefined
ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేస్తుంది. దీంతోపాటు నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో తాను లీడ్‌గా `థ్యాంక్యూ బ్రదర్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది విడుదలకు రెడీ అవుతుంది.
undefined
మరోవైపు `ఖిలాడి`, `రంగమార్తాండ`, తమిళంలో విజయ్‌ సేతుపతితో ఓ సినిమా చేస్తుంది. దీంతోపాటు `ఆచార్య`, `పుష్ప`లోనూ కనిపించనుందని టాక్‌. అలాగే పవన్‌ సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుందనే వార్తలొచ్చాయి.
undefined
click me!