టీవీలో వాడితే బూతు సినిమాలో వాడితే హీరో... లైగర్ వివాదంపై అనసూయ సంచలన కామెంట్స్

Published : Aug 26, 2022, 03:01 PM IST

ఆన్లైన్ ట్రోలర్స్ పై అనసూయ ఫైట్ చేస్తుంది.  ఎగతాళి చేస్తున్నవాళ్లకు తనదైన శైలిలో సమాధానం చెబుతుంది. జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ జోకులు ఎంజాయ్ చేసే నువ్వా మాట్లాడేదని ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకు అనసూయ ఘాటైన సమాధానం చెప్పింది.   

PREV
16
టీవీలో వాడితే బూతు సినిమాలో వాడితే హీరో... లైగర్ వివాదంపై అనసూయ సంచలన కామెంట్స్
Anasuya Bharadwaj

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో అనసూయ గొడవ పెద్దదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తనను ట్రోల్ చేస్తున్న వారిని వదలనని ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లైగర్ మూవీ నిన్న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ లోపు అనసూయ ఖాతాలో ఓ ట్వీట్ వెలిసింది. అమ్మను తిట్టిన వాళ్లకు ఇలాగే జరుగుతుందని ఆమె కామెంట్  చేశారు. ఈ కామెంట్ లైగర్ మూవీ గురించేనని నెటిజెన్స్ అభిప్రాయం. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమెపై బాడీ షేమింగ్ కి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అనసూయ సోషల్ మీడియా వేదికగా వాళ్లకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.
 

26


అంటీ అంటూ తిడుతూ నన్ను అవమానించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాను.  బూతులు తిడుతూ ఏజ్ గురించి కామెంట్ చేసిన వారి స్క్రీన్ షాట్స్ తీసి లీగల్ గా చేయాల్సింది చేస్తానని హెచ్చరించారు. ఈసారి తనను ట్రోల్ చేసేవాళ్లకు గట్టిగానే బుద్ధి చెప్పాలని ఆమె డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. హేటర్స్ ప్రతి కామెంట్ కి అనసూయ సమాధానం చెబుతున్నారు. 

36
Anasuya Bharadwaj

ఇండస్ట్రీలో ఉంటూ ఒక సినిమా ఫెయిల్యూర్ ని సెలెబ్రేట్ చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని ఓ నెటిజెన్ ప్రశ్నించగా అనసూయ సమాధానం చెప్పారు. ఇండస్ట్రీలో ఉంటూ డబ్బులిచ్చి నన్ను మాదర్*** అనిపించడం ఎంత వరకు కరెక్ట్ అండి? నా ప్లేస్ లో మీరు ఉంటే ఆ బాధ మీకు తెలిసి ఉండేది. మీరు క్షమించగలరా? అని ఎదురు ప్రశ్నించారు. పరోక్షంగా అనసూయ లైగర్ చిత్రానికి ప్లాప్ టాక్ రావడం ఎంజాయ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.  

46
Anasuya Bharadwaj

అలాగే మరొకరు జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ కామెడీకి పగలబడి నవ్వుతావు దాన్ని మదం అనాలా.... అని అనసూయను ప్రశ్నించాడు. ఆ కామెంట్ కి అనసూయ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మీకు ధైర్యం ఉంటే షో చేసే వాళ్ళను, చూసే వాళ్ళను వెళ్లి అడగండి. మంచి కోసం పోరాడుతున్న నన్ను కాదు. అయినా సినిమా వాళ్ళు వాడితే హీరో. టీవీలో వాడితే బూతు. ఏమిటీ హిపోక్రసీ? అని అనసూయ సమాధానం చెప్పారు. నెటిజెన్స్ తో ఆమె పోరాటం కొనసాగుతుంది. ప్రస్తుత వివాదం మూలాలు అర్జున్ రెడ్డి మూవీలో ఉన్నాయి.

56

2017లో అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ చెప్పిన ఓ డైలాగ్ వివాదాస్పదమైంది. మాధర్*** అని విజయ్ పలికిన డైలాగ్ ని అనసూయ తప్పుబట్టింది. అమ్మను అంత మాట అంటారా అని స్టూడియోస్ లో కూర్చొని పెద్ద పెద్ద డిబేట్స్ నడిపారు. సినిమా నుండి ఆ డైలాగ్ తొలగించాలి. అలాగే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనసూయ డిమాండ్స్, డిబేట్స్ విజయ్ దేవరకొండ చాలా లైట్ గా తీసుకున్నాడు. మరి అప్పటి ఈ వివాదాన్ని అనసూయ ఇంకా మర్చిపోలేదనేది నెటిజెన్స్ అభిప్రాయం. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాను విమర్శిస్తూ అనసూయ ఆ ట్వీట్ చేశారని అంటున్నారు. 

66


అనసూయ మదిలో ఏముందో తెలియదు కానీ, ఆమె ట్వీట్ వివాదాస్పదమైంది. ఇక నేడు ఆమె నెటిజెన్స్ తో ఛాట్ చేశారు. తనను అభిమానించేవారికి, విమర్శిస్తున్న వాళ్లకు నేరుగా సమాధానం చెబుతున్నారు. ఎప్పుడూ వివాదాల్లో ఉండే అనసూయ మరో వివాదంలో వేలు పెట్టినట్లు అనిపిస్తున్నారు. 

click me!

Recommended Stories