Sankranthi: చలువ జోడు పెట్టి పతంగులు ఎగరేస్తున్న అనసూయ... స్టార్ యాంకర్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్!

Published : Jan 15, 2023, 05:17 PM IST

స్టార్ యాంకర్ అనసూయ మొత్తంగా పండగ మూడ్ లోకి జారుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు.   

PREV
18
Sankranthi: చలువ జోడు పెట్టి పతంగులు ఎగరేస్తున్న అనసూయ... స్టార్ యాంకర్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్!
Anasuya Sankranthi Celebrations


చలువ కళ్ళజోడు పెట్టి అనసూయ పంతంగులు ఎగరేశారు. భర్త భరద్వాజ్, ఇద్దరు పిల్లలతో కలిసి మైదానంకి వెళ్లారు. అక్కడ గాలిపటాలు స్వయంగా ఎగరేశారు. అనసూయ లుక్ చాలా స్పెషల్ గా ఉంది. క్యాజువల్ షూస్, గాగుల్స్ పెట్టుకొని సాంప్రదాయ లుక్ కి మోడ్రన్ టచ్ ఇచ్చారు. 
 

28
Anasuya Sankranthi Celebrations

జీవితాన్ని ఆస్వాదించడం తెలిసిన అనసూయ బిజీ లైఫ్ లో కూడా వేటికివ్వాల్సిన ప్రాధాన్యత వాటికిస్తుంది. ముఖ్యంగా ఆమె కుటుంబానికి కొంత సమయం కేటాయిస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ తో విందులు, విహారాలు ఎంజాయ్ చేస్తారు. 
 

38
Anasuya Sankranthi Celebrations


అనసూయ సంక్రాంతి(Sankranthi 2023) వేడుకల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఎప్పటిలాగే హేటర్స్ ట్రోల్ చేస్తున్నారు. అఫ్ కోర్స్... అనసూయ అవేమీ పట్టించుకోదు. తిక్కరేగితే ఇంకా ఎక్కువ చేస్తుంది. 

48
Anasuya Sankranthi Celebrations


కాగా అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశారు. మొదట జబర్దస్త్ వదిలేసిన అనసూయ... మెల్లగా మిగతా షోస్ నుండి కూడా తప్పుకున్నారు. అనసూయ యాంకర్ గా ఒక్క ప్రోగ్రాం టెలికాస్ట్ కావడం లేదు. బుల్లితెర ఆడియన్స్ ఆమెను మిస్ అవుతున్నారు. 
 

58
Anasuya Sankranthi Celebrations

అనసూయ పూర్తి దృష్టి నటనపై పెట్టారు. నటిగా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అనసూయకు ఇతర భాషల్లో కూడా ఆఫర్స్ రావడం విశేషం. గత ఏడాది అనసూయ ఒక తమిళ, మలయాళ చిత్రం చేశారు. 
 

68
Anasuya Sankranthi Celebrations


యాంకర్ గా వచ్చే ఆదాయంతో పోల్చితే నటిగా పెద్ద మొత్తం రాబట్టవచ్చు. అనసూయ నిర్ణయానికి ఇది కూడా కారణం. షోలలో గంటల తరబడి గొంతు చించుకుంటే ఏమొస్తుంది చెప్పండి. నటిగా సక్సెస్ అయితే ఒక సినిమాకు కోట్లు అందుకోవచ్చు. 
 

78
Anasuya Sankranthi Celebrations


ప్రస్తుతం అనసూయ కాల్షీట్ కి రూ. 3 లక్షలకు పైనే తీసుకుంటున్నారట. రోజుకు రెండు షిఫ్ట్స్ పనిచేసినా ఆరు లక్షలకు పైనే సంపాదించవచ్చు. జీవితంలో ఎవరైనా బెటర్మెంట్ కోరుకుంటారు కదా. అనసూయ కూడా అధిక ఫేమ్, మనీ వచ్చే యాక్టింగ్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. 
 

88
Anasuya Bharadwaj

ప్రస్తుతం అనసూయ(Anasuya) పుష్ప సీక్వెల్ లో నటిస్తున్నారు. అల్లు అర్జున్-సుకుమార్ ల ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ భారీ ఎత్తున తెరకెక్కించనున్నారు. ఇక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో కీలక రోల్ చేశారు. రంగమార్తాండ విడుదలకు సిద్ధమైంది. 
 

click me!

Recommended Stories