విదేశాల్లో జాలీగా అనసూయ... ఫ్యామిలీతో కలిసి అలా ఎంజాయ్ చేస్తూ!

Published : Jul 22, 2023, 01:24 PM IST

యాంకర్ అనసూయ హాలిడే ట్రిప్ లో ఉన్నారు. ఆమె అమెరికా దేశంలో చక్కర్లు కొడుతున్నారు. ఫ్యామిలీతో ఆహ్లాదంగా గడిపేస్తున్నారు.   

PREV
16
విదేశాల్లో జాలీగా అనసూయ... ఫ్యామిలీతో కలిసి అలా ఎంజాయ్ చేస్తూ!
Anasuya Bharadwaj

నటులది తీరిక లేని జీవితం. వేళా పాళా అని కూడా ఉండదు. అందుకే ఏ మాత్రం విరామం దొరికినా హాలిడేస్ ప్లాన్ చేస్తుంటారు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా మారిన అనసూయ ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు. ప్రొఫెషన్ కోసం ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయదు. చిన్న బ్రేక్ దొరికితే చాలు కుటుంబంతో పాటు నచ్చిన ప్రదేశాన్ని వెళ్ళిపోతుంది. 

 

26
Anasuya Bharadwaj

ప్రస్తుతం అనసూయ భర్త భరద్వాజ్, ఇద్దరు కొడుకులతో కాలిఫోర్నియాలో ఉన్నారు. అక్కడి తమ ట్రిప్ ఫోటోలు అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందమైన నగరంలో అనసూయ ఆహ్లాదంగా గడుపుతున్నారు. సాగర తీరాల్లో చల్లగా సేద తీరుతున్నారు. అనసూయ వీడియో షేర్ చేయగా వైరల్ అవుతుంది. 

36
Anasuya Bharadwaj

నటిగా అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కొన్ని రకాల పాత్రలకు అనసూయ పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నారు. ఇటీవల ఆమె నటించిన విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. విమానం మూవీలో అనసూయ వేశ్య రోల్ చేయడం విశేషం. బోల్డ్ రోల్ లో ఆమె ఒదిగిపోయి నటించారు. విమానం జీ 5 లో స్ట్రీమ్ అవుతుంది. 

 

46

ఇక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగమార్తాండ మూవీలో గడసరి కోడలిగా మెప్పించింది. రంగమార్తాండ సైతం అనసూయకు మంచి పేరు తెచ్చింది. 

56
Anasuya Bharadwaj

ఇక పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది. అనసూయ ఒక్కో కాల్షీట్ కి ఐదు లక్షల రూపాయలకు పైనే తీసుకుంటున్నారట. యాంకర్ గా వచ్చే ఆదాయంతో పోల్చితే నటిగా పెద్ద మొత్తం రాబట్టవచ్చు. అనసూయ యాంకరింగ్ మానేయడానికి ఇది కూడా కారణం.


 

66
Anasuya Bharadwaj

మరోవైపు అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అనసూయకు యాంకరింగ్ మీద విరక్తి పుట్టిందట. మేకర్స్ టీఆర్పీ కోసం ప్లే చేస్తున్న ట్రిక్స్ తనకు నచ్చడం లేదట. అందుకే యాంకరింగ్ మానేశానని ఆమె వెల్లడించారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని ఖరాకండిగా చెప్పింది. 

Read more Photos on
click me!

Recommended Stories