చున్నీవెనక్కివేసి.. ఎద అందాలతో మైమరిపిస్తున్న ప్రణీతా.. గ్రీన్ లెహంగాలో వజ్రంలా మెరిసిపోతున్న బుట్టబొమ్మ..

First Published | Jun 19, 2023, 4:14 PM IST

బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) ఎప్పటికప్పుడు గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. రోజురోజుకు అందాన్నిపెంచేస్తూ ఫ్యాన్స్, నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది.
 

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. మొన్నటి వరకు తెలుగు, కన్నడ, తమిళంలోనే సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇక మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది.
 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ తన అభిమానులతో ఫిదా చేస్తోంది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ గ్లామర్ షో చేస్తూ నెటిజన్లనూ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. 
 


తాజాగా ప్రణీత పంచుకున్న ఫొటోల్లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. పదహారేళ్ల అమ్మాయిలా లెహంగావోణీలో మెరిసిపోతోంది. స్లిమ్ ఫిట్ అందాలతో, శిల్పి చెక్కిన శిల్పంలా ఎక్కడా లోటు లేని సొగసుతో చూపును తనపైనే నిలిచేలా చేసింది.
 

ఇటీవల ట్రెడిషనల్ లుక్ లోనే మెరుస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా గ్రీన్ లెహంగా వోణీలో వెలిగిపోయింది. ఆకర్షించే కురులు, ఆకట్టుకునే ఫోజులు, బ్యూటీఫుల్ స్మైల్, మైమరిపించే సిగ్గుతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. 
 

అయితే, ప్రణీతాకు మొదటి లాక్ డౌన్ లోనే వ్యాపారవేత్త నితిన్ రాజ్ తో వివాహం జరిగింది. కరోనా కారణంగా వీరి పెళ్లి ఎలాంటి ఆడంభరాలు లేకుండా సింపుల్ గా జరిగింది. ఇక గతేడాది ప్రణీత పండంటి ఆడబిడ్డకూ జన్మనిచ్చి  తల్లిగా ప్రమోషన్ పొందింది. 
 

పెళ్లై, ఓ బిడ్డకు తల్లైనా కూడా ప్రణీత మాత్రం చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటోంది. కేరీర్ లో మరింత ముందుకు వెళ్లాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తోంది. ప్రస్తుతం మలయాళ చిత్రం Dileep 148లో నటిస్తోంది.
 

Latest Videos

click me!