నేనూ తెలంగాణ బిడ్డనే.. విజయ్ దేవరకొండ కామెంట్స్ తో మళ్లీ రచ్చ.. సాలిడ్ రిప్లై ఇచ్చిన రంగమ్మత్త!

Published : Apr 04, 2024, 09:05 PM IST

స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) నెటిజన్ కు సాలిడ్ రిప్లై ఇచ్చింది. విజయ్ దేవరకొండ విషయంలో మరోసారి తనను లాగడం ఘాటుగా స్పందించింది.

PREV
16
నేనూ తెలంగాణ బిడ్డనే.. విజయ్ దేవరకొండ కామెంట్స్ తో మళ్లీ రచ్చ.. సాలిడ్ రిప్లై ఇచ్చిన రంగమ్మత్త!
Anasuya bharadwaj

స్టార్ యాంకర్ అనసూయ (Anasuya) ప్రస్తుతం నెట్టింట తన అభిమానులకు దగ్గరగా ఉంటున్న విషయం తెలిసిందే. తన గురించిన అప్డేట్స్ ను  ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తూ ఉంటుంది.

26

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే అంశాలపైనా స్పందిస్తుంటుంది. తనకున్న అవగాహన మేరకు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఇదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.

36

ముక్కుసూటిగా మాట్లాడటం.. నిర్మొహమాటంగా, నిర్భయంగా ప్రశ్నించడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే అనసూయ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో ఎదురైన ట్రోల్స్ ను కూడా ఎదుర్కొంది.

46

వారికి ధీటుగా బదులిస్తూ అందరినీ తిప్పికొట్టింది. తన వెర్షన్ ను వినిపించడంలో ఏమాత్రం విఫలం కాలేదు. ఇక తాజాగా విజయ్ చేస్తున్న కామెంట్స్ పై ఓ నెటిజన్ ‘పీఆర్ మాఫియా లేపుతుందని, ఆ తర్వాత అనసూయ ఆంటీని దింపుతారని’ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతనికి అనసూయా తాజాగా సాలిడ్ రిప్లై ఇచ్చింది.

56

‘ఎందుకు అస్తమానం నన్ను లాగుతారు.. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి వదిలేశాను. అనవసరంగా నేనే హైప్ చేస్తున్నానని నా వాళ్లు అంటుంటూనే నిజమేనేమో అని వదిలేశాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే... నాకు సింపథి అక్కర్లేదు. నాకు నా మీద, నా దేవుడి మీద నమ్మకం ఉంది.

66

మా అమ్మ నాన్నలు నాకిచ్చిన విలవులు, పెంపకం నన్ను నా దృష్టిలో ఎప్పుడు దిగజారనివ్వవు.. ఇప్పుడు ఈ ట్వీట్ ని కూడా తమ స్వర్ధానికి వాడుకున్నా నేను ఆశ్చర్యపోను.. కానీ నాకు ఇప్పుడు నేను కాదు లేదు..అన్నట్టు.. నాకు తెలిసి మీరు నేను చుట్టాలం అస్సలు కాదండి.  కాబట్టి నేను మీకు ఆంటీ కానేమో’ అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం ట్వీటర్ తో ఇది వైరల్ గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories